యోగ విషయంలో మరో సారి నిబద్ధత చాటండి : ప్రధాని మోడీ పిలుపు
యోగాను అందరూ తమ జీవింలో అంతర్భాగంగా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరో పది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రానుందని, యోగా విషయంలో తమ నిబద్ధతను తిరిగి చాటుకోవాలన్నారు. అలాగే ఇతరులు కూడా యోగా చేసేట్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మరో పది రోజుల్లో ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. యోగా ద్వారా ఏకత్వం, సామరస్యాన్ని సాధించవచ్చని, అలాగే సాంస్కృతిక, భౌగోళిక సరిహద్దులను కూడా అధిగమించిందన్నారు. ప్రపంచం వ్యాప్తంగా మిలియన్ల మందిని సంపూర్ణ శ్రేయస్సు కోసం ఏకం చేసిందని పేర్కొన్నారు.