‘‘మన్ కీ బాత్’’ విషయం లో ఆలోచనలు పంచుకోండి : ప్రధాని పిలుపు
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసే రేడియో ప్రసంగం ‘‘మన్ కీ బాత్’’ మళ్లీ ప్రారంభం కానుంది. జూన్ 30 న 111 వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం పున: ప్రారంభం అవుతుందని మోదీ స్వయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఆలోచనలు, సూచనలు దేశ ప్రజలు తనతో పంచుకోవాలని ఆయన కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. ఎలక్షన్ కోడ్ ముగియడం, కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం రావడం, ప్రధానిగా మోదీయే తిరిగి ప్రమాణ స్వీకారం చేయడంతో మన్‌కీ బాత్ మళ్లీ ప్రారంభం కానుంది. ‘‘ఎన్నిలక కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత మన్‌కీ బాత్ మళ్లీ రానుంది చెప్పడం ఆనందంగా వుంది. జూన్ 30 న ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని కోరుతున్నాను. my gov లేదా NAMO యాప్, 1800117800 ఫోన్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలు పంచుకోవాలి’’ అని మోదీ ట్వీట్ చేశారు.