పీఓకేని తిరిగి భారత్‌లో కలపడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎస్. జైశంకర్
పీఓకేని తిరిగి భారత్‌లో కలపడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి వుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు. పీఓకే భారత్ నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని, పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్‌లో తీర్మానం కూడా చేశామని ఆయన గుర్తు చేశారు. న్యూ ఢల్లీిలోని గార్గి కళాశాలలోని విద్యార్థులతో ఆయన మాట్లాడారు. తాము చేసిన ఈ తీర్మానానికి అన్ని పార్టీలూ కట్టుబడి వున్నాయన్నారు. ఇది తమ నిబద్ధత అని అన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆర్టికల్ 370 రద్దు కాదని చాలా మంది భావించారు కానీ మోదీ ప్రభుత్వం రద్దు చేసి చూపించిందని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ 370 రద్దే పీఓకే గురించి ప్రజలు లోతుగా ఆలోచించేట్లు చేసిందని జైశంకర్ అన్నారు.