పొన్నగంటి ఆకు కూర
ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తోంది. కుష్టు వ్యాధి, రక్తదోషం, కఫం, వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది.
జ్వరం, శరీరంలో వాపు, దురద, ప్లీహ సమస్య, వాతం, వాంతి, అరుచి వీనిని పోగొడుతుంది. హృదయానికి మేలు చేస్తుంది.
ఇది చలువ చేస్తుంది. జ్వరతాపాలను, అతిదాహం తగ్గిస్తుంది. ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయి.
వేడివలన వచ్చే తలపోట్లలో పొన్నగంటి ఆకు తలకు కట్టడం మంచిది.
పొన్నగంటిఆకు రక్తదోషాలను మరియు కుష్టురోగాలను నయం చేస్తుంది.
– ఉషాలావణ్య పప్పు