అత్యంత వైభవంగా పూరి జగన్నాథుని రథ యాత్ర
ఒడిశాలోని పూరీలో అత్యంత ప్రసిద్ధమైన జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. జై జగన్నాథ్ నామస్మరణ మధ్య వైభవంగా సాగింది. రథారూఢులై వున్న నాలుగు మూర్తులకు పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతీ హారతిచ్చారు. లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంఓని గుండీచా ఆలయం వైపు రథాలు సాగాయి. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రథాలకు పూజలు చేశారు. రాష్ట్రపతి ముర్ము, ఒడిశా గవర్నర్ రఘువర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాంరీa, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ జగన్నాథుని రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. 53 సంవత్సరాల తర్వాత ఒకే రోజున పురుషోత్తముని దర్శనం, నేత్రోత్సవం, రథయాత్రలు ఏర్పాటు చేశారు. ఈ సారి ఇదే విశేషం. జై జగన్నాథ్, హరిబోల్ నినాదాలతో మూడు రాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు.
ప్రతి యేడు ఆషాఢ మాసంలోని శుక్లపక్షం ద్వితీయ తిథిన ప్రారంభమవుతుంది. పూరీ ఆలయ చరిత్రలోనే అన్ని ఉత్సవాల కంటే ఇది ప్రత్యేకమైంది. ఈ జగన్నాథ రథయాత్ర దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైంది. ప్రతి యేడాది జూన్ లేదా జూలై మాసంలో జరుగుతుంది. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి వుంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలుంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు.