జనాభా తారుమారు…

ప్రపంచంలో ప్రధాన మతాలను అనుసరించే వారి సంఖ్య ఓ వైపున పెరుగుతుంటే.. మరోవైపు తమకు ఎలాంటి మతమూ లేదని చెప్పేవారు కూడా గణనీయంగానే ఉన్నారు. క్రైస్తవం ఇప్పటికీ అతి పెద్ద మతంగా కొనసాగుతున్నప్పటికీ, మతం వద్దనుకొనే వారి సంఖ్య కూడా దాంట్లోనే అధికంగా ఉంది. అందువల్ల శాతాల్లో లెక్కిస్తే క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది. ఇంకోవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా పెరుగుతూ ఈ శతాబ్దం మధ్యభాగం నాటికి క్రైస్తవంతో సమానం కానుందని తెలిపింది. హిందు వుల జనాభా స్థిరంగా ఉండగా, బౌద్ధుల సంఖ్య పడిపోతోంది. ప్యూ రీసెర్చి సెంటర్‌ జరిపిన అధ్య యనంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

2010-2020 కాలానికి చెందిన 2,700 జనాభా లెక్కలు, సర్వేలను అధ్యయనం చేసిన ప్యూ సెంటర్‌ మతాల వారీగా జనాభా పెరుగుదలలో మార్పులను గుర్తించింది. ఈ పదేళ్ల కాలంలో క్రైస్తవుల జనాభా 218 కోట్ల్ల నుంచి 230 కోట్లకు పెరిగింది. అయితే ప్రపంచ జనాభాలో క్రైస్తవుల వాటా తగ్గింది. 2010లో 30.6 శాతం ఉండగా, అది 28.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ముస్లిం జనాభా 34.70 కోట్ల మేర అధికమయింది. మొత్తం జనాభా సుమారు 200 కోట్ల వరకు ఉంది. 1.8 పాయింట్ల వృద్ధి శాతంతో ప్రపంచ జనాభాలో 25.6 శాతం వాటా పొందింది. ఏ మతమూ లేదని చెప్పే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 24.2 శాతం వరకు ఉంది. హిందూమతం, జూడాయిజం జనాభా స్థిరంగా ఉంది. గత పదేళ్లలో బౌద్ధుల జనాభా తగ్గింది. ఐరోపా దేశాల్లో క్రైస్తవుల సంఖ్య తగ్గుతుండగా సబ్‌ సహారన్‌ ఆఫ్రికాలో పెరుగుతోందని ఈ అధ్యయనం చేసిన నిపుణులు అభిప్రాయపడ్డారు.

బకింగ్‌హామ్‌ యూనివర్సిటీ నివేదిక

లండన్‌ లోని బకింగ్‌హామ్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో బ్రిటన్‌లో బ్రిటిష్‌ వారు మైనారిటీలుగా ఉంటారని తెలిపింది. పెరుగుతున్న శరణార్థుల సంఖ్య మరియు అక్కడ జనన-మరణాల రేటును అంచనా ప్రకారం ప్రస్తుతం బ్రిటన్‌లో స్థానిక బ్రిటిష్‌ ప్రజల సంఖ్య 73 శాతంగా ఉందని, ఇది 2050 నాటికి 57 శాతానికి తగ్గుతుందని మరియు 2063 నాటికి బ్రిటన్‌లో స్థానిక బ్రిటిష్‌ ప్రజలు మైనారిటీగా మారతారని మరియు నల్లజాతి జనాభా 50 శాతానికి పైగా ఉంటుందని ఈ నివేదికలో తెలిపింది. దీనికంటే ముందే, లండన్‌ మరియు బకింగ్‌హామ్‌ వంటి నగరాల్లో బ్రిటిష్‌ వారు మైనారిటీగా మారారు.

2063 నాటికి, బ్రిటిష్‌ సంతతికి చెందిన వారు మైనారిటీగా మారతారు!

2075 నాటికి, బ్రిటిష్‌ సంతతికి చెందిన జనాభా 73 నుండి 44 శాతానికి తగ్గుతుందని ఈ నివేదికలో చెప్పబడిరది. 2100 నాటికి, కేవలం 33.7 శాతం మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రస్తుతం బ్రిటన్‌లో నల్లజాతీయుల జనాభా 19.7 శాతంగా ఉంది, ఇది 2050 నాటికి 34.8 శాతంగా ఉంటుంది. 2063 నాటికి బ్రిటిష్‌ సంతతికి చెందిన వారు మైనారిటీలుగా మారతారు మరియు విదేశాలలో జన్మించిన వారు మరియు వారి వారసులు 2079 నాటికి మెజారిటీ అవుతారు.

బ్రిటన్‌లో ప్రతి ఐదవ వ్యక్తి ముస్లిం అవుతారు!

బ్రిటన్‌లో ముస్లింల జనాభా ప్రస్తుతం 7 శాతం మాత్రమే, ఇది రాబోయే 25 సంవత్సరాలలో 12 శాతం అవుతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి, బ్రిటన్‌లో ముస్లింల జనాభా 19-20 శాతానికి చేరుకుం టుంది, అంటే బ్రిటన్‌లో ప్రతి ఐదవ వ్యక్తి ముస్లిం అవుతారు.

ఇస్లాం క్రైస్తవ మతం తర్వాత బ్రిటన్‌లో రెండవ అతిపెద్ద మతం. 2021 జనాభా లెక్కల ప్రకారం, బ్రిటన్‌లో ముస్లింల జనాభా 4 మిలియన్లకు మించిపోయింది. 2001 సంవత్సరంలో ఇది కేవలం 16 లక్షలు మాత్రమే. ప్రస్తుతం, లండన్‌లో అత్యధికంగా 15 శాతం ముస్లింలు ఉన్నారు.

బ్రిటన్‌ రాజకీయాల్లో మార్పు వస్తుంది!

ప్రభుత్వ జనాభా లెక్కల నుండి పొందిన ఈ సమాచారం అందరికీ కళ్లు తెరిపించేదని కెంట్‌ విశ్వవిద్యాలయ గౌరవ ప్రొఫెసర్‌ మాట్‌ గుడ్విన్‌ అన్నారు. ఈ శరణార్థుల కారణంగా, బ్రిటన్‌ తన అసలు సంస్కృతి, సంప్రదాయం మరియు గుర్తింపును కోల్పోతుందని దీని కారణంగా బ్రిటన్‌ రాజకీయాలు మరియు విదేశాంగ విధానంలో కూడా మార్పు వస్తుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *