స్వాధీనత నుండి స్వతంత్రం వైపు ప్రయాణం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, శ్రీ ‌విజయదశమి ఉత్సవం, 2021

పరమపూజనీయ శ్రీ మోహన్‌ ‌జీ భాగవత్‌ ఉపన్యాసం

(సంక్షిప్త స్వేచ్ఛానువాదం)

విదేశీ పాలన నుండి మనం స్వాతంత్య్రం పొంది ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తవు తాయి. మనకి 1947 ఆగస్ట్ 15 ‌స్వాతంత్య్రం వచ్చింది. దీనిని ముందుకు తీసుకుపోవడానికి మన దేశ రథపు పగ్గాలను మనమే చేపట్టాము. అలా స్వాధీనత నుండి స్వతంత్రత వైపు మన ప్రయాణం మొదలైంది.

సామాజిక సమరసత

వివక్షలేని, సహిష్ణుత కలిగిన సమాజం ఉన్నప్పుడే ఆ దేశం సమైక్యంగా ఉంటుంది. పురాతనమైన కులపరమైన విభజనలు ఇటువంటి సమాజానికి ప్రధాన అడ్డంకి. దీనిని పరిష్కరించ డానికి అనేకరకాల ప్రయత్నాలు, అనేక మార్గాల్లో జరిగాయి. అయినా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పటికీ మన సమాజంలో కుల దురభిమానం కనిపిస్తూనే ఉంది. ప్రజల మధ్య సయోధ్య, సద్భావనను పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నవారి కంటే అందుకు భిన్నంగా పనిచేస్తున్న వారే దేశపు మేధో పటలంపై ఎక్కువగా కనిపిస్తున్నారు.

స్వాతంత్య్ర, జాతీయ విలువలు

పురాతన కాలం నుండి ఈ దేశపు సమైక్యత, ఏకత్వం, సర్వ మానవాళి స్వేచ్చలే మన జీవన విధానపు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దీని కోసమే అనేకమంది తమ రక్తాన్ని ధారపోశారు.  ఏ దేశం కోసం వారు తమ జీవితాలను అర్పించారో ఆ మాతృభూమి పట్ల నిష్ట మొదలైనవి మన జాతీయ జీవనపు ప్రధాన లక్షణాలు.

ఈ ఉన్నత ఆదర్శంతో ప్రస్తుత మన స్థితిని పోల్చి చూస్తే మనం స్వాధీనత నుండి స్వతంత్రానికి ప్రారంభించిన యాత్రలో ఇంకా చాలా దూరం వెళ్లవలసి ఉందని అర్ధమవుతుంది.

భారత్‌ అభివృద్ధి, ఒక ఉన్నత స్థానానికి ఎదగడం తమ స్వార్ధ ప్రయోజనాలకు భంగకరమని భావించే శక్తులు కొన్ని ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి శక్తులు కొన్ని దేశాల్లో అధికారంలో కూడా ఉన్నాయి. భారత్‌ ‌లో సనాతన విలువలతో కూడిన మతం విలసిల్లితే ఈ స్వార్ధపర శక్తుల ఆటలు సాగవు.

కుటుంబ ప్రబోధన్‌

ఈ ‌సవాళ్ళపై పట్టు సంపాదించేందుకు, తప్పు, ఒప్పు, మంచి,చెడు వంటి వాటి మధ్య వ్యత్యాసం తెలిపే వాతావరణం మన ఇళ్ళలో నిర్మాణం అవ్వాలి. ఎంతో మంది సంస్కర్తలు, ప్రవచన కారులు, సామాజిక ధార్మిక సంస్థలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. మనం కూడా మన కుటుంబ సభ్యులతో ఈ విషయాలు ఆలోచించి ప్రవర్తన సరళిని పెంపొందించచ్చు. సంఘ స్వయంసేవకులు కూడా కుటుంబ ప్రబోధన్‌ ‌ద్వారా ఈ లక్ష్యం కోసం పని చేస్తున్నారు. ‘‘మన్‌ ‌కా బ్రేక్‌ ఉత్తమ్‌ ‌బ్రేక్‌ ‘‘అని మనం వినో, చదివో ఉంటాం. నిర్లక్ష్య ధోరణిని, భారతీయ విలువల వ్యవస్థపై పలు రకాలుగా జరుగుతున్న దాడికి జ్ఞానమే మందు.

కరొన పై యుద్ధం

కరొన 3వ ఉధృతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవు తూనే మనం మన 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం కోసం తయారవు తున్నాం. రెండవ ఉద్ధృతిలో సమాజం తన సామూహిక ప్రయత్నంతో నిబ్బరం ప్రదర్శించింది. రెండవ ఉధృతి చాలా భీకరంగా ఉండింది, చాలా మంది యువకులను సైతం బలిగొంది. తమ ప్రాణాలను లెక్క చేయక మానవాళి సేవలో స్వచ్ఛందంగా నిమగ్నమైన వ్యక్తుల కృషి అభినందనీయం. ప్రమాదం ఇంకా పొంచి ఉంది. కరొనతో మన యుద్దం ఇంకా ముగియలేదు.     కోవిడ్‌ ‌మహమ్మారి ‘స్వ’ ఆధారిత శాస్త్రీయ జ్ఞాన వ్యవస్థ,దృష్టి పట్ల అవసరాన్ని మళ్ళీ ఒకసారి చూపించింది. కోవిడ్‌ను ఎదుర్కొనడంలో మన దేశీయ పద్ధతులు, ఆయుర్వేదం చూపిన ప్రభావం మనం అనుభవించాం.

ఆరోగ్యం భారతీయ దృష్టి

మన శాస్త్రీయ పద్ధతిలో ఉండే ఆహార, విహార, వ్యాయామ, ధ్యాన విధానం ఆరోగ్యకర వాతావరణాన్ని, రోగాల ఉంది తట్టుకునే శక్తి కలిగిన దేహాలను పెంపొందిస్తుంది. మన శాస్త్రీయ పద్ధతి ప్రకృతి అనుసంధానమై, వైశ్విక దృష్టిని కలిగిస్తుంది.  ప్రకృతి సిద్ధ జీవన పద్ధతిని ప్రోత్సహించే వ్యాపక ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది. సంఘ స్వయంసేవకులు కూడా నీటి పొదుపు, ప్లాస్టిక్‌ ‌రహిత జీవనం, వృక్షారొపణం వంటి వాటి ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఆయుర్వేద పద్ధతులు, ఇతర విధానాల ద్వారా ప్రాథమిక వైద్య అవసరాలను గ్రామ స్థాయిలో అందించవచ్చు.

 జనాభా విధానం

దేశపు అభివృద్ధిని ఆకాంక్షించేవారందరికీ ఒక ప్రధాన సమస్య కనిపిస్తుంది. దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న జనాభా భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్యను గురించి ఆలోచించాలి. మన స్వలాభాన్ని వదిలి దేశ ప్రయోజనాలను ముందుంచే అలవాటు మనం చేసుకోవాలి.

సంఘటిత హిందూ సమాజం

మన ధార్మిక భావనలను కలుషితం చేసి నాశనం చేసేందుకు అదను కోసం చూస్తున్నాయి. భారత్‌ ‌లోని ప్రధాన శ్రవంతిగా హిందూ సమాజం ఈ దాడుల నుండి తన సంఘటిత శక్తి, విశ్వాసం, భీతిరహిత భావనలను తెలుసుకున్నప్పుడే తట్టుకుని నిలబడగలదు. కనుక హిందువు అని చెప్పుకునే వారందరూ తమ వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, వృత్తి జీవితాలలో హిందూ జీవన పద్ధతిని పాటించి నిలబడాలి.

 మనందరిని కలిపే బంధం మన పరంపర, మన హృదయాలలో మన పూర్వీకుల పట్ల ఉన్న భావన, మన మాతృ భూమి పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. హిందూ అనే పదానికి అర్ధం ఇదే. ఈ మూడు భావనలను మనసులో పెట్టుకుని సనాతన ఐక్యతను ఆభరణంగా ధరించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లచ్చు. మనం ఇది చేయాలి. ఇదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ లక్ష్యం. ఈ తపస్సులో మీవంతు సమర్పణనను అందించమని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *