అయోధ్య రాముడ్ని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య బాలరాముడ్ని బుధవారం దర్శించుకున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత హోదాలోనే వెళ్లారు. రాష్ట్రపతి ముర్ము ఆలయంలోకి ప్రవేశించగానే… స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ తర్వాత హారతి ఇచ్చారు. అంతకు ముందుకు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అనంతరం దేవాలయ ప్రతినిధులు ఆమెకు రామాలయ ప్రతిమను జ్ఞాపికగా అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ట్విట్టర్లో షేర్‌ చేశారు. అంతకు ముందు అయోధ్యలోని వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకి గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌, మంత్రి సూర్య ప్రతాప్‌ స్వాగతం పలికారు. అనంతరం అయోధ్యలోని హనుమాన్‌ ఘారీ దేవాలయాన్ని సందర్శించి, హనుమంతుడ్ని దర్శించుకున్నారు. అయితే… అయోధ్యను దర్శించిన రాష్ట్రపతుల్లో ముర్ము మూడోవారు.

నిజానికి బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా రావాల్సింది. కానీ ప్రోటోకాల్‌ కారణంగా ఆమె ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇప్పుడు ముర్ము రామాలయ దర్శనంతో ప్రాణ ప్రతిష్ఠకు ఆమెకు ఆహ్వానం అందలేదని రాహుల్‌ గాంధీతో సహా విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టినట్లైంది. వ్యక్తిగత హోదాలో ముర్ము అయోధ్య రాముడ్ని దర్శించుకున్న నేపథ్యంలో ఆ విమర్శలు పూర్తిగా తప్పని, ఆమెకు హిందూ ధర్మం పట్ల, విశ్వాసవల పట్ల అచంచల విశ్వాసం వున్నట్లు నిరూపితమైంది. ముర్ము గిరిజన మహిళే కాబట్టి, ఆహ్వానించలేదని కాంగ్రెసస నేత రాహుల్‌ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్  ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ దీటుగా సమాధానమిచ్చారు. రాహుల్‌ గాంధీ చేసిన  వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని , ఈ ప్రకటన పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. అలాగే నిరాధారమైన ఆరోపణలని, హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేవిగా వున్నాయ ని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఇద్దరికీ.. ప్రాణ ప్రతిష్ఠకి ఆహ్వానించామని తెలిపారు. షెడ్యుల్  కులాలు, షెడ్యుల్  తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత పేద వర్గాలను కూడా ప్రాణ ప్రతిషషఠ మహోత్సవానికి ఆహ్వానించామని, వారందరూ వచ్చారని చంపత్‌ రాయ్‌ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *