జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పథ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడకులకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబింయాంతో హాజరయ్యారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ధన్కర్, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్ తో ఈసారి కవాతులో పాల్గొనేట్లు శకటాలను రూపొందించారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక రాకెట్ ప్రత్యేక ఆకర్షణ.
ఈ క్రమంలో రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 21 తుపాకీల వందనంతో జాతీయ గీతాన్ని ఎగురవేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల కవాతు, బ్యాండ్ బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడం ఈ సంవత్సరం వేడుకలకు ప్రధాన ఆకర్షణ. శకటాల ఇతివృత్తం ‘స్వర్ణ భారతదేశం: వారసత్వం, అభివృద్ధి’. ఈ కవాతులో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి 15 శకటాలు ప్రదర్శించబడ్డాయి.