శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అయ్యప్ప మాల ధరించి, ఇరుముడితో సంప్రదాయంగా అక్కడ వున్న 18 మెట్లు ఎక్కి, అయ్యప్పను దర్శించుకున్నారు.అనంతరం ఇరుముడిని సమర్పించి ప్రతేక పూజలు నిర్వహించారు. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకున్న తొలి రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము నిలిచారు.
ఆలయ ప్రధాన ద్వారం వద్దకి చేరుకోగానే దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆరు కాన్వాయ్‌లతో ద్రౌపది ముర్ము శబరిమలకు చేరుకున్నారు. రాష్ట్రపతి కోసం నిబంధనలు సడలించిన అధికారులు వాహనాల్లో శబరిమల చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.