మూత్రపిండ రోగాల నివారణ

*         పల్లేరు కాయల చూర్ణం పూటకు చెంచా మోతాదులో అరకప్పు నీటిలో కలిపి తాగితే అన్ని రకాల మూత్రపిండ సమస్యలు నయం అవుతాయి.

*          ప్రతిపూట జీలకర్ర కషాయం పావుకప్పు తాగితే మూత్రపిండాలకు బలం చేకూరు తుంది.

*           బొబ్బర్లు ఉడకబెట్టి గుగ్గిళ్లలా ఉదయం, సాయంత్రం గుప్పెడు మోతాదులో తీసుకుంటే మూత్రపిండ సమస్యలు నివారణ అవుతాయి.

*          ఉత్తరేణి చెట్టు సమూల కషాయాన్ని పూటకు పావుకప్పు తాగితే త్వరగా నయమవుతుంది.

*           చేమంతి రేకుల చూర్ణాన్ని పూటకు చెంచా మోతాదులో తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని పంచదారలో కలిపి తీసుకోవచ్చు.

*         మధుమేహం, అధిక రక్తపోటుతో కిడ్నీల పనితీరు  మందిగిస్తుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పైన చెప్పిన వాటిలో ఏది సులభంగా ఆచరించగలరో చూసుకుని ప్రయత్నించండి. అలాగే మూత్రపిండ సమస్య ఉన్నవారు శరీరానికి వేడి కలిగించే వస్తువులు తినకూడదు. మినుములు, కూల్‌ డ్రిరక్స్‌, ఫ్రిజ్‌ నీరు, నూనె వేపుళ్ళు, వంకాయ, గోంగూర, పాత పచ్చళ్లు అసలు తినకూడదు.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *