గొంతు సంబంధ సమస్యల నివారణ
– శొంటి కొమ్మును పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గును.
బొంగురు గొంతు
– తేనెలో కొంచం మిరియాల పొడి వేసి తీసుకుంటే బొంగురుపోయిన గొంతు మాములుగా అవుతుంది.
– మామిడి ఆకుల కషాయం అరకప్పు తీసుకుని అందులో చెంచా తేనె కలుపుకుని తాగాలి. అలా ఉదయం , సాయంత్రం రెండుపూటలా మూడు రోజుల పాటు తీసుకోవాలి .
– ముల్లంగి రసాన్ని పూటకు పావుకప్పు తీసుకోవాలి .
– చిన్న అల్లం ముక్క బుగ్గన పెట్టుకుని రసం మింగవచ్చు.
– రాత్రి నిద్రపోవడానికి ముందు ఒక గ్లాసు వేడివేడి పాలలో ఒక చిన్న చెంచా మిరియాల పొడి కలుపుకుని తాగితే గొంతులో రొంప, గొంతు బొంగురు పోతాయి .
– గొంతులో మంట, నుస ఉంటే లవంగ మొగ్గ నోటిలో వేసుకొని రసం మింగుతూ ఉండాలి.
– చిన్నపిల్లలకు గొంతులో మంట, నుస ఉంటే వారితో అప్పుడప్పుడు లేత కొబ్బరి తినిపించాలి.
– గొంతులో టాన్సిల్స్ వాపు వచ్చినపుడు ఉల్లిగడ్డ దంచి ఆ రసం టాన్సిల్స్ పై పూస్తే వాపు తగ్గుతుంది.
– లేత కొబ్బరి వేర్ల కషాయం, మెంతుల కషాయంతో పుక్కిలిస్తే గొంతు మంట తగ్గును.
– టాన్సిల్స్ ఇబ్బంది ఉన్నప్పుడు తాంబూలంలో వాడే కాచు పొడి చేసి పూటకు పావు చెంచా పొడి కొంచం తేనెతో కలిపి తీసుకోవాలి లేదా అరకప్పు నీటిలో కలిపి తాగాలి. ఇలా రోజు చేస్తే టాన్సిల్స్ వాపు క్రమక్రంగా తగ్గుతుంది.
– ఉషాలావణ్య పప్పు