యూపీలోని పిలిభిత్ లో భారీగా అక్రమ మత మార్పిళ్లు… సీఎం యోగి దర్యాప్తుకు ఆదేశం

ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్ నేపాల్ సరిహద్దుల దగ్గర పిలిభిత్ జిల్లాలో సిక్కులు మెజారిటీగా ఉండే గ్రామాల్లో అక్రమంగా సామూహిక మతమార్పిడులు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత కొన్నేళ్ళలో 3వేల కంటె ఎక్కువమంది సిఖ్ఖులను మతం మార్చారని అఖిల భారత సిఖ్ఖు పంజాబీ సంక్షేమ సంఘం వెల్లడించింది. పిలిభిత్ జిల్లా హజారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైలాహా, తాతార్‌గంజ్, బామన్‌పురా, భాగీరథ్, సింఘారా తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో సిక్కులను మతం మార్చారు.ఆ ప్రాంతాల్లో సుమారు 30వేల మంది సిక్కులు జీవిస్తున్నారు. వారిలో ఎక్కువమంది వ్యవసాయదారులు, మిగిలిన వాళ్ళు చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారు. నేపాల్ సరిహద్దుల్లోని ఆ ప్రాంతాల్లో 2020 నుంచీ మత మార్పిడి కార్యక్రమాలు ఊపందుకున్నాయని స్థానిక ప్రజలు, సిక్కు సంస్థలూ గుర్తించాయి.

నేపాల్ నుంచి వచ్చిన ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఈ మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. వారు మొదట స్థానికులు కొందరిని పాస్టర్లను చేసారు. ఆ పాస్టర్లు నిరుపేదలూ, చదువు లేనివారూ అయిన స్థానిక సిఖ్ఖులకు డబ్బులు ఆశపెట్టి, వ్యాధులు తగ్గిస్తామని కబుర్లు చెప్పి మతం మార్చారు.

అఖిల భారత సిక్కు పంజాబీ సంక్షేమ కౌన్సిల్ అధ్యక్షుడు హర్‌పాల్ సింగ్ ఈ తీవ్ర సమస్య గురించి వివరించారు. స్థానిక గురుద్వారా ‘శ్రీ సింగ్ సభ’లో మీడియాతో మాట్లాడుతూ పిలిభిత్‌లోని సిఖ్ఖు గ్రామాల్లో 3వేల మందికి పైగా సిఖ్ఖులను మతం మార్చారని వెల్లడించారు. అలా మతం మారిన 160 కుటుంబాల జాబితాను జిల్లా అధికారులకు సమర్పించారు.కొన్ని కుటుంబాలు తమ ఇళ్ళ మీద సిలువ గుర్తులు చిత్రించుకున్నాయి. జిల్లా అధికారుల జోక్యం వల్ల చాలామంది తమ ఇళ్ళ మీద అలాంటి చిహ్నాలను తొలగించారు, కానీ క్రైస్తవాన్నే అనుసరిస్తున్నారు.

ఈ విషయం మే 13న ఒక సిఖ్ఖు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. బైలాహా గ్రామానికి చెందిన మన్‌జీత్‌ కౌర్ హజారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్తను ఇప్పటికే క్రైస్తవంలోకి మతం మార్చేసారని, ఇప్పుడు తననూ తన పిల్లలనూ మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారనీ ఆమె ఆవేదన చెందుతోంది. మతం మారడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె పొలాలను ధ్వంసం చేసారు, ఆమె పిల్లలపై భౌతికంగా దాడులు చేసారని ఆమె ఫిర్యాదు చేసింది.

మన్‌జీత్‌ కౌర్ ఫిర్యాదు మేరకు హజారా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసారు. ఎనిమిది మంది వ్యక్తులు, పేర్లు తెలియని మరికొందరు వ్యక్తుల మీద అక్రమ మత మార్పిడులకు పాల్పడ్డారని కేసు నమోదు చేసారు. ఆ సంఘటన గురించి జిల్లా పోలీసులతో పాటు పూరన్‌పూర్ సబ్ కలెక్టర్ కూడా దర్యాప్తు జరుపుతున్నారని జిల్లా కలెక్టర్ సంజయ్ సింగ్ చెప్పారు. క్రైస్తవంలోకి మారితే ప్రభుత్వ పథకాలు కూడా వచ్చేలా చేస్తామంటూ కొందరు ప్రలోభపెడుతున్నారని తెలిసిందని, వాటి గురించి కూడా దర్యాప్తు చేస్తామనీ జిల్లా కలెక్టర్ చెప్పారు.మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు అందిందని పిలిభిత్ ఎస్‌పి అభిషేక్ యాదవ్ ధ్రువీకరించారు. ఆ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. భారత్ నేపాల్ సరిహద్దుల్లోని బలీహా, తాతార్‌గంజ్, బామన్‌పూర్, భాగీరథ్ వంటి గ్రామాల్లో 2020 నుంచీ నేపాలీ పాస్టర్ల మతమార్పిడి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని అఖిల భారత సిఖ్ఖు పంజాబీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు హర్‌పాల్ సింగ్ జగ్గీ చెప్పుకొచ్చారు.

సిక్కు మతస్తులు ప్రలోభాలకు లొంగి లేదా ఒత్తిడులు, బెదిరింపులకు భయపడి మతం మారుతుండడానికి కారణం వారి పేదరికం, చదువు లేకపోవడమే అని స్థానిక సిఖ్ఖు నాయకులు చెబుతున్నారు. చిత్రమేంటంటే, మత మార్పిడి బాధితులకు వాగ్దానం చేసిన లబ్ధులు ఏవీ ఇప్పటివరకూ అందనివారు, ఆరోపితుల మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అన్ని సరిహద్దు జిల్లాల్లోనూ నిఘా పెంచాలని ఆదేశించారు. ‘ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడుల నిషేధ చట్టా’న్ని సమర్థంగా అమలు చేయాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఖ్ఖు సంస్థలు డిమాండ్ చేసాయి.

మే 13 న హజారా పోలీస్ స్టేషన్ లో అక్రమ మత మార్పిడి ఆరోపణలపై ఎనిమిది మందిపై అలాగే గుర్తు తెలియని వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.దీనిపై అక్కడి జిల్లా కలెక్టర్ స్పందించారు. జిల్లా పోలీసులతో విచారణ చేయిస్తున్నామని, ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి రావాలని తెలిపారు.ఇక బలవంతంగా మతం మారాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని పిలిభిత్ ఎస్పీ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా సిక్కు పంజాబీ వెల్ఫేర్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు లక్నో గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడు హర్పాల్ సింగ్ జగ్గీ, 2020 నుండి బైల్హా, తాతార్‌గంజ్ మరియు బమన్‌పూర్ భగీరత్ వంటి సరిహద్దు గ్రామాలలో నేపాలీ పాస్టర్లు మతమార్పిడులను చేస్తున్నారని తెలిపారు.

రెండు వేల కంటే ఎక్కువ జనాభా వున్న ఈ గ్రామాల్లో ప్రలోభాలు, మూఢనమ్మకాలతో పాటు వ్యాధులను నయం చేస్తామంటూ బుకాయిస్తూ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారుని సిక్కు వర్గం పెద్దలు కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మత మార్పిళ్ల బారిన పడ్డ 160 కుటుంబాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిక్కు పెద్దలు ప్రభుత్వానికి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *