పొన్నగంటి ఆకు కూర
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ప్రతిరోజు వీటిని తీసుకోవడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అందుకే వైద్యులు ప్రతిరోజు ఒక ఆకు కూర కచ్చితంగా తీసుకోవాలని సలహా ఇస్తుంటారు. అలాగే పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి.
పొన్నగంటి ఆకులో బి6,సి,ఏ విటమిన్లతో పాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. ఎముకల ఎదుగుదలకు ఇందులో లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. అలాగే బరువును నియంత్రిం చడంతోపాటు క్యాన్సర్ కారకాలను కూడా నయం చేస్తుంది
ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తుంది. కుష్టు వ్యాధి, రక్తదోషం, కఫం వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. జ్వరం, శరీరంలో వాపు, దురద, స్ప్లీన్ సమస్య, వాతం, వాంతి, అరుచి పోగొడుతుంది. హృదయానికి మేలు చేస్తుంది. ఇది చలువచేస్తుంది. జ్వరతాపాలను, అతిదాహం తగ్గిస్తుంది.
ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయి. వేడివలన వచ్చే తలపోట్లలో పొన్న గంటి ఆకు తలకు కట్టడం మంచిది. పొన్నగంటి ఆకు రక్త దోషాలను, కుష్టు రోగాలను నయం చేస్తుంది.
– ఉషాలావణ్య పప్పు