పుచ్చ కాయ
పుచ్చకాయ గురించి తెలియనవారు ఉండరు అవునా.. మన అమ్మమలు, నాయనమ్మ తినమని చెపుతుంటారు.
కానీ ఇందులో ఎన్ని ఔషద గుణాలు దాగివున్నాయో తెలుసా. ముఖ్యంగా ఎండా కాలంలో ఇది చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఎండ వేడికి శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల వడదెబ్బకు గురవుతాము. వడదెబ్బ కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యానికి కూడా దారితీయవచ్చును. అలాంటి సమస్య ఎదురవకుండా వడదెబ్బను నివారించడానికి పుచ్చకాయ బాగా ఉపయోగ పడుతుంది.
* 89% నీళ్ళు కలిగి ఉంటుంది, దీనివల్ల కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది.
* శరీరములో ఉండే క్రొవ్వు పదార్ధాలను కరిగిస్తుది
* శరీరములో వేడి తత్వము తగిస్తుంది.
* శరీర అవయవాలు సక్రమంగా పని చేసే విధంగా చూస్తుంది.
* ఒంటె నీళ్ళు దచుకున్నట్టు ఎండా కాలంలో తిన్న పుచ్చ కాయ సంవత్సరం పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
* అందుకే మరి ఈ పుచ్చకాయ ను మనం తిందామా ఈ ఎండా కాలంలో.