‌పుచ్చ కాయ 

వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ తింటే చాలా మంచిది. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. అందుకే వేసవిలో పుచ్చకాయలకి చాలా డిమాండ్‌ ఉం‌టుంది. గృహిణులకు పుచ్చకాయ గురించి తెలియని వారు ఉండరు. మన అమ్మమ్మలు, నాయనమ్మలు తినమని చెపుతుంటారు.

ఇందులో ఎన్ని ఔషద గుణాలు దాగివున్నాయో తెలుసా.

– 89% నీళ్ళు కలిగి ఉంటుంది, దీనివల్ల కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది.

– శరీరములో ఉండే క్రొవ్వు పదార్ధాలను కరిగిస్తుది.

– శరీరములో వేడి తత్వాన్ని తగ్గిస్తుంది.

– శరీర అవయవాలు సక్రమంగా పని చేసే విధంగా చూస్తుంది.

– ఒంటె నీళ్ళు దాచుకున్నట్టు ఎండా కాలంలో తిన్న పుచ్చకాయ సంవత్సరం పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

– పుచ్చకాయలు రక్తపోటు, గుండె పోటు తగ్గిస్తాయి. మహిళలకు ఎంతో మేలు చేస్తాయి

– పుచ్చకాయలో ఉండే లైకోపీన్‌, ‌కుకుర్బిటాసిన్‌ ‌సహా పుచ్చకాయలో కనిపించే సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్‌ ‌గుణాలను కలిగి ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా లైకోపీన్‌ ‌ప్రొస్టేట్‌, ‌కొలొరెక్టర్‌ ‌క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కుకుర్బిటాసిన్‌ ‌కణితి పెరుగుదలను నివారిస్తుంది.

– అందుకే పుచ్చకాయ తినాలి.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *