పుదీనా ఆకు
పుదీనా ఆకాలు.. వీటని వంటల్లో మంచి రుచి, వాసన అందించడానికి వాడుతుంటారు. పుదీనా వంటల రుచిని పెంచడానికే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొన్ని పుదీనా ఆకులు మన ఆహారంలో, టీ రూపంలో తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం…
– నోటి అరుచి పోగట్టడానికి పుదీనా పచ్చడి తినాలి. పుదీనా ఆకులు, ఖర్జురపు కాయలు, మిరియాలు, సైన్ధవ లవణం, ద్రాక్షా మొదలయి నవి పచ్చడిచేసి అందులో నిమ్మకాయల రసం పిండి ఉపయోగిస్తారు
– పుదీనా ఆకుని నేతితో వేయించి కాని పచ్చిది కాని నూరి పచ్చి మిరపకాయలు, ఉప్పు చేర్చి నూరి నిమ్మరసం పిండి ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.
– జ్వరాలు మొదలయిన వాటితో నీరసపడి లేచినవారికి నోరు రుచి పోతుంది. వారికి ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది.
– గుండెలకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల్లో పుదీనా మంచి గుణకారిగా ఉంటుంది. ఎక్కిళ్లు, వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా వాడతగినది.
– పుదీనా ఆకుల రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గును. కణతలుకు రాసుకుంటే తలనొప్పి నయం అగును. పుళ్లు మొదలయిన వాటికి రాస్తే తొందరగా నయం అవుతుంది.
– అజీర్ణ రోగులు పుదీనా నిత్యం సేవించటం మంచిది.
– ఉషాలావణ్య పప్పు