పుదీనా ఆకు

– నోటి అరుచి పోగట్టడానికి పుదీనా పచ్చడి చేసుకుని తినాలి. పుదీనా  ఆకులు, ఖర్జురపు కాయలు, మిరియాలు, సైన్ధవ లవణం, ద్రాక్షా మొదలయిన పచ్చడిచేసి అందులో నిమ్మకాయల రసం పిండి ఉపయోగిస్తారు.

–  పుదీనా ఆకుని నేతితో వేయించి కాని, పచ్చిది కాని, నూరి పచ్చి మిరపకాయలు, ఉప్పు చేర్చి  నిమ్మరసం పిండి ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

–  జ్వరాలు మొదలయిన వాటితో నీరసపడి లేచినవారికి నోరు రుచి పోతుంది. వారికి ఈ పచ్చడి అద్బుతంగా ఉంటుంది.

– గుండెలకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల్లో పుదీనా మంచి గుణకారిగా ఉంటుంది. ఎక్కిళ్లు మరియు వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా వాడతగినది.

–  పుదీనా ఆకుల రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గును. కణతలకు రాసుకుంటే తలనొప్పి నయం అగును. పుళ్లు మొదలయిన వాటికి రాస్తే తొందరగా నయం అగును.

–  అజీర్ణ రోగులకు పుదీనా నిత్యం సేవించటం మంచిది.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *