మరికొద్ది గంటల్లోనే భారతితెరుచుకోనున్న పూరి రత్న భాండార్
మరికొద్ది గంటల్లోనే ఒడిశాలోని పూరీలో వున్న జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ తెరుచుకోనుంది. ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల గది తెరుచుకోనుంది. అందులోని విలువైన వస్తువులపై ఆడిట్ కూడా చేయనున్నారు. 46 సంవత్సరాల తర్వాత ఈ రహస్య గది తెరుచుకోనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయన్న భయం వుంది. ముందు జాగ్రత్తగా పాములు పట్టడంతో అత్యంత సిద్ధహస్తులైన వారిని పిలిపించారు. ఒక వేళ విష సర్పాలు కాటేసినా.. సత్వర వైద్యం కోసం వైద్యుల్ని కూడా సిద్ధం చేసి వుంచారు. అయితే.. అధికారులు చేపట్టనున్న ఈ లెక్కింపుకు ఎన్ని రోజులు పడుతుంది? ఎవరు పాల్గొంటారు? అనే విషయాలు మాత్రం తెలియాల్సి వుంది.