పుష్పమాత్రం విచిమయాత్
మూలచ్ఛేదం న కారయేత్
మాలాకార యివా రామే
న యాథాంగారకారకః
భావం: ప్రజలను రక్షించి, వారిని నొప్పించ కుండా రాజు పన్నులు తీసుకోవాలి. పూల మొక్కలను పరిరక్షించి పూలు తీసుకునే తోటమాలిలా ఉండాలితప్ప చెట్లను నరికి, కాల్చి బొగ్గులు చేసి అమ్ముకునే వాడిలా ప్రవర్తించ కూడదు.