రవీంద్రనగర్‌ ఒక ఆదర్శవంతమైన గ్రామం

కొన్ని కలలు నిజంగా నెరవేరుతాయా అనే సందేహం ఉంటుంది. ఒకప్పుడు నిత్యం ఎదో ఒక అటంకం, అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడే ఒక గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుందనే అనుమానం ఆ గ్రామ ప్రజలందరికీ ఉండేది. ప్రజలు విధ్వంసకర స్థితి నుండి అభివృద్ధి వైపు ఎలా వెళుతున్నారు. సంకల్పం, కృషి కలిస్తే ఒక గొప్ప పరిణామం ఎలా సాధ్యమౌతుందో ఒక్కసారి ఈ గ్రామంలోకి ప్రవేశించి చూస్తే తెలుస్తుంది. ఈ గ్రామం సంవత్సరాలుగా నీటి సేకరణ పద్ధతులను ఉపయోగిస్తోంది. బహిరంగ కాలువలు, బురద గుంటలు లేవు. అన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు, మరుగు దొడ్లు ఉన్నాయి. గ్రామం మొత్తం దానిమ్మ, మామిడి, పనస, జామ, పెద్ద ఉసిరి (ఆమ్లా), బ్లాక్‌ ప్లం లాంటి చెట్లతో, తులసి వంటి ఔషధ మొక్కలతో అలంకరించి ఉంటుంది. వందశాతం అక్షరాస్యత కలిగిన ఈ గ్రామం రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామాలలో ఒకటి. మేము ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖిరి జిల్లాలోని ఒక ఆదర్శ గ్రామమైన రవీంద్ర నగర్‌ గురించి మాట్లాడుతున్నాము. ఈ గ్రామం గురుదేవ్‌ రవీంద్ర నాథ్‌ ఠాకూర్‌ జన్మ దినోత్సవం సందర్భంగా గుర్తించారు. అందుకే ఆయన పేరు పెట్టారు.

దేశ విభజన భయాందోళనలను ఎదుర్కొని ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి కష్టాలను చవిచూసిన కష్టజీవుల కథ ఇది. కూడు, గూడు లాంటి ప్రాథమిక అవసరాలు లేవు సరికదా కలరా, డయేరియా, బ్లాక్‌ ఫీవర్‌ వంటి అంటువ్యాధులు శరణార్థి శిబిరాల్లో వ్యాపించాయి. పునరావాసం పేరుతో ఈ కుటుంబాలను గోమతి నది పక్కనే ఉన్న అడవిలో పడేశారు. ఇలా 8 ఏళ్లపాటు వీరి వేదన కొనసాగింది. స్థానిక స్వయంసేవక్‌ ,గ్రామాభివృద్ధి జిల్లా అధిపతి శ్రీ తపన్‌ కుమార్‌ మాట్లాడుతూ వారు తమ భోజనానికి అడవి బియ్యాన్ని ఉడకబెట్టి చేపలతో తింటారని చెప్పారు. 50 సంవత్సరాల క్రితం, సంఫ్‌ు ఇక్కడ తన శాఖను ప్రారంభించి అభివృద్ధికి బాటలు వేసింది. ప్రజలు తమ గ్రామాన్ని జీవితాన్ని మార్చుకొని విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది. స్వయంసేవకుల సహాయంతో గ్రామస్థులు చేసిన మొదటి పని వ్యవసాయానికి అనుకూలమైన భూమిని తయారు చేయడం. ఇది చాలా కష్టమైన పని, దీనికి గ్రామస్తులు, స్వయంసేవకుల కృషి చాలా అవసరం.

రవీంద్ర నగర్‌ (గతంలో మియాపూర్‌ అని పిలువబడేది) చేతబడి పాములాడిరచేవారికి కోటగా పరిగణించబడేది. ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడేవారు. అయితే ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, ప్రజలకు ఏదైనా మంచి చేయాలని స్వయంసేవకులు నిశ్చయించుకున్నారు, ఈ ప్రక్రియలో భాగంగా 1969 లో మొదటి శాఖ భైరవచంద్ర రాయ్‌ గారి ద్వారా నిర్వహించారు. అప్పటి నుండి గత 50 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా శాఖలు జరుగుతున్నాయి. భూమిని విరాళంగా ఇచ్చిన స్వయంసేవకుల సహాయంతో ఇక్కడ మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. తర్వాత ఈ పాఠశాల ప్రభుత్వం నుండి గుర్తింపు పొందింది. నేటికీ, సంజయ్‌ విశ్వాస్‌, మల్లికా మండల్‌, మిలన్‌, శంభు వంటి, స్వచ్ఛంద సేవకులు ఉపాధ్యాయులుగా 100% అక్షరాస్యత రేటును చేరుకోవడానికి సహాయం చేస్తున్నారు. సంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ కళకళ లాడుతూ ఉంటుంది. ఆవు పేడతో వారి ఇళ్లను అలుకుతారు, ఉదయం శంఖనాదంతో ప్రారంభమవుతుంది. గ్రామంలోని మహిళలు ఉపాధి కోసం బీడీలు తయారు చేస్తారు. కానీ ఆశ్చర్యకరంగా, గ్రామంలో ఎవరూ బీడీలు తాగరు. గ్రామంలో నాలుగు స్వయం సహాయక సంఘాలు మహిళలకు కుట్లు, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇస్తూ ఉపాధికి మార్గం సుగమం చేస్తున్నాయి.

రవీంద్ర నగర్‌ పరిశుభ్రతకు ఒక నమూనా ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడైనా ఇంత స్వచ్ఛమైన, అందమైన పాఠశాల కనుగొనడం కష్టం. పాఠశాలలు, పంచాయతీలు, ఇళ్లు, దేవాలయాలు, రోడ్లు, ఆట స్థలాలు అన్నీ స్వయంసేవకుల సహాయంతో పరిశుభ్రంగా ఉంటాయి. ప్లే గ్రౌండ్‌ను స్టేడియంగా మార్చి స్థానికుల సహ కారంతో సరైన రోడ్లు నిర్మించారు. సంఫ్‌ులోని గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రస్తుత ప్రాంతీయ అధిపతి శ్రీ ప్రేమ్‌ శంకర్‌ అవస్తి, 2009లో ఈ గ్రామం అభివృద్ధి బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సంరక్షకునిగా ప్రసిద్ధి చెందారు. గ్రామంలో ఎవరూ నిరుద్యోగులు లేరని గర్వంగా చెప్పుకుంటారు. రవీంద్ర నగర్‌ వాణిజ్య చిమ్నీల తయారీకి ప్రసిద్ధి. విగ్రహాల తయారీ, నిర్మాణం, ఎలక్ట్రీషియన్‌, మోటారు బైండిరగ్‌ మొదలైన ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ గ్రామానికి చెందిన యువకులు తమకు తాముగా మంచి జీవితాన్ని ఏర్పరచు కున్నారు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వైద్య సలహాదారు డాక్టర్‌ చిత్రాంజన్‌ విశ్వాస్‌. రవీంద్ర నగర్‌ ఒక ఆదర్శ వంతమైన గ్రామం, అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా ఆటుపోట్లను ఎలా తిప్పికొట్టవచ్చు అనేదానికి ఉదాహరణగా నిలిచి ఇతరులు అనుసరించడానికి మార్గంగా నిలించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *