ఏది కొన్నా, తిన్నా.. మన ధర్మీయుల దగ్గరే తీసుకోండి : రాధా మనోహర్ స్వామి
ఏది కొన్నా,,, ఏది తిన్నా.. మన ధర్మానికి చెందిన వారి దగ్గర మాత్రమే తీసుకోవాలని, స్వదేశీని ప్రోత్సహించాలని రాధా మనోహర్ స్వామీజీ పిలుపునిచ్చారు. ప్రజలంతా భక్తి భావంతో, దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెంలో ‘‘హిందూ సమ్మేళనం’’ జరిగింది. ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ హైందవ ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మనదేశం పేరుచెప్పగానే గంగామాత, భగవద్గీత, సీతామాత గుర్తుకురావాలని వారన్నారు.అందుకే మన ప్రధాని మోదీ సైతం ఏదేశం వెళ్లినా, వేరే ఏదేశ అధికారి మనదేశానికి వచ్చినా సరే భగవద్గీతను బహుమతిగా ఇస్తున్నారని వారన్నారు. హిందువులెప్పుడూ ఎవరి చెడునూ కోరుకోరనీ, దేశాన్ని ముక్కలు చేయరని పేర్కొన్నారు.
హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, కుల వివక్షకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, సనాతన ధర్మం పట్ల యువతలో చైతన్యం తీసుకురావడం ఈ సమ్మేళనాల ప్రధాన లక్ష్యం అని సంఘ శతాబ్ది సందర్భంగా దేశమంతటా ఈ హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారని ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ్ సహకార్యదర్శి అయిన సూరి శివరామకృష్ణ అన్నారు. సంఘం వ్యక్తి పూజ ఎన్నటికీ చేయదని, వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వదని పేర్కొంటూ దేశమే ముందు అని పేర్కొంటూ అందుకే సంఘ భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించిందనీ, సంఘ ప్రతీకార్యక్రమంలోనూ, శాఖలోనూ భగవాద్వజానికి నమస్కరించిన తర్వాతే కార్యక్రమ ప్రారంభం ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో భక్తి కోలాటాలు, నాటకాలు, పాటలు, సాంప్రదాయ నృత్యాలు వంటి కార్యక్రమాలు అక్కడి విచ్చేసిన ప్రజలని ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల దాదాపు 12 గ్రామాల నుండి 5,400 మందికి పైగా హిందువులు హాజరయ్యారు.