‘‘రైల్ వన్’’ యాప్.. రైల్వే సేవలన్నీ ఒకేచోట
ఇకపై రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించే యాప్ వచ్చేసింది. ‘‘రైల్ వన్’’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ ను రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లందరికీ యాప్ అందుబాటులో వుంటుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు సేవలన్నీ సులభంగా అందుతాయని రైల్వే ప్రకటించింది. CRIS ఏర్పాటై 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యాప్ ను ఆవిష్కరించామని తెలిపారు.
అత్యంత సులభంగా, సరళంగా వుండేలా రైల్ వన్ యాప్ ను రూపొందించామని రైల్వే పేర్కొంది. కేవలం సేవల యాప్ తోనే కాకుండా రైలు సేవల మధ్య సమగ్రమైన కనెక్టివిటీకి ఉపయోగపడుతుంది.
1. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాక.. గతంలో వున్న రైల్ కనెక్ట్, యూటీఎస్ఆన్ మొబైల్ యాప్ కి వున్న లాగిన్ వివరాలతో రైల్ వన్ లో లాగిన్ కావొచ్చు.
2.సులభంగా లాగిన్ అయ్యేలా ఎం పిన్ తో పాటు బయోమెట్రిక్ సౌకర్యం కూడా వుంది.
3. కొత్త వినియోగదారులు సులభంగా రిజిస్టరయ్యేలా అతి తక్కువ సమాచారం అందిస్తే సరిపోతుంది.
4. రిజిస్టర్ కాని వారు మాత్రం గెస్ట్ లాగిన్ ఆప్షన్ తో మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారా వివరాలు పొందవచ్చు.
5. రైల్వే ఈ వాలెట్ కూడా వుంది. ముందుగానే అందులో డబ్బును జమ చేసుకొని సేవలకు చెల్లించవచ్చు.
6. ఈ యాప్ ద్వారా ప్లాట్ ఫాం టిక్కెట్లను 3 శాతం డిస్కౌంట్ తో పొందవచ్చు.