మట్టికి వాన పాములు, సూక్ష్మ జీవులే పంచ ప్రాణాలు… వాటిని ఎలా వృద్ధి చేయాలంటే
భారత దేశ వ్యవసాయం ముందు నుంచీ ప్రకృతి మీద ఆధారపడినది . రైతులు వారి విత్తనాలు వారే తయారు చేసుకునేవారు. రసాయనాలకు దూరంగా, పశువుల వ్యర్థాల నుంచి వచ్చిన సంప్రదాయ ఎరువులనే వాడేవారు. దిగుబడులు కూడా అధికంగా వచ్చేవి. కానీ.. కాలం మారింది. ప్రకృతి వ్యవసవయం పోయి, రసాయనాల వ్యవసాయం వచ్చేసింది. దీని నుంచి ఇప్పుడిప్పుడే కొందరు రైతులు బయటపడుతున్నారు. మళ్లీ సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. అయితే… ప్రకృతి సిద్ధమైన ఈ పర్యావరణ వ్యవస్థతో వ్యవసాయం చేస్తే డబ్బుల ఖర్చు వుండదు. ఈ వ్యవస్థ మొత్తం మీదా మట్టిలోని జీవరాశి నిరంతరాయంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ వుంటాయి. కానీ.. గత 50 సంవత్సరాలుగా రైతులు రసవయనిక ఎరువుల, రసవయనిక పురుగు మందులు, శిలీంధ్రనాశనులు, కలుపు మందులు, వర్మీ కంపోస్టు వాడుతుండటం వల్ల మట్టిని లోతుగా దుక్కి చేయడం వల్ల మట్టిలో వుండాల్సిన వానపాములు, ఇతర సూక్ష్మ జీవరాశి అంతా నాశనమైపోయింది. మట్టిలోని జీవరాశి అంతరించడం వల్ల మట్టిలోని మొక్కల వ్యర్థాల్లోని పోషకాలను మొక్కల వేళ్లు వినియోగించుకునే రూపంలోకి మార్చే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. నేల నిసవ్ససమైంది. అందువల్లే ఏదైనా ఎరువు బయటి నుంచి తెచ్చి వేస్తేనే పంటను పండించే దుస్థితికి పొలం చేరుకుంది.
తిరిగి వానపాములను ఆహ్వానిద్దాం రండి…
ఇప్పుడు గనక మనం రసాయనిక ఎరువుల, రసవయనిక పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు పొలంలో వేయకుండా పంటలు పండిరచుకోవాలని అనుకుంటే మట్టిలోని జీవరాశిని, వానపాములను తిరిగి ఆహ్వానించాలి. నేలను విషతుల్యం చేయకుండా జీవరాశి మనుగడకు అనుకూలమైన పరిసస్థతిని పొలాల్లో ఇరిగి కల్పించాలి. అందుకోసమే ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ’’ ఇప్పుడు అమలులోకి రావాలని పాలేకర్ పెద్ద ఉద్యమమే చేపట్టారు.
పొలం మట్టిలో జీవరాశిని పెంపొందించడం ఎలా?
సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు కూడా వాడకుండా పొలంలోని మట్టిలో జీవరాశిని ఎలా పెంపొందించాలంటే… మట్టిలో వానపాముల వంటి సఱన్నిత జీవరాశి మనుగడకు అనువైన పరిస్థితిని లేదా అనువైన వాతావరణాన్ని లేదా సూక్ష్మ వాతావరణాన్ని కల్పించాలి. అలాంటి అనువైన సహజ వాతావరణం నెలకొన్నప్పుడు మనం ఆహ్వానించకుండానే భూమి అడుగు పొరల్లోంచి, గట్లలో నుంచి పొలంలోకి వాటికవే వసవ్తయి. నానాటికీ తమ సంతతిని తామరతంపరగా వృద్ధి చేసుకుంటాయి. ఈ క్రమంలో మట్టిలోని పోషకాలు మొక్కలు వినియోగించుకోగలిగే రూపంలోకి మారుతూ వుంటాయి. ఈ పనిని ఉచితంగానే అవి చేసిపెడతాయి.
నాటు ఆవు పేడ, మూత్రం మహాద్భుతం…
మట్టిలో సూక్ష్మ జీవరాశిని ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చేసే అద్భుత గుణాలు దేశవాళీ ఆవుపేడ, మూత్రంలో పుష్కలంగా వున్నాయి. మన పరిసరాల్లో వుండే దేశవాళీ ఆవులే రైతులకు ఉపయోగపడతాయి. దేశవాళీ ఆవుపేడ, మూత్రంలో ఇంతటి అద్భుత గుణాలున్నాయి. ప్రకృతి వ్యవసాయకుడు పాలేకర్ 1988 నుంచి 1996 వరకూ పదే పదే పరీక్షించి చూసి, ఈ నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాతే ఈ అద్భుతం అందరికీ తెలిసింది . మట్టిని స్సోక్ష్మ రాశి అన్ని పోషకాలతో కూడిన సవరవంతమైన భూమిగా మార్చడానికి నాటు ఆవు పేడ, మూత్రాలే అద్భుతంగా దోహదం చేస్టాయి.