వాన కాలం ఉద్యానవన పంటల యోజన ఇది… ఆయిల్ పామ్ పంటకి పెద్దపీట
ఉద్యానవన పంటల సాగు విషయంలో తెలంగాణ ప్రభుత్వం యోజనను విడుదల చేసింది. రాష్ట్రంలో రాబోయే వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని అనుకున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా పంపింది. ఆయిల్ పామ్ సహా కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ తోటలు కూడా ఈ వరుసలో వున్నాయి. అయితే ఆయిల్ పామ్ విషయంలో కీలకంగా వ్యవహరించారు. మొత్తం 14 లక్షల ఎకరాల్లో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రసఱ్తతం కేవలం 1.02 లక్షల ఎకరాల్లోనే సాగు అవుతోంది. నిజానికి 11.82 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. . అయితే…అనుకున్న లక్ష్యానికి మాత్రం చేరుకోలేదు. మళ్లీ వారితో లక్ష్యం చేరేలా ప్రభుత్వం యోజన చేయాలని నిర్ణయించింది.
ఇక… మిర్చి పంటపై కూడా కీలక నిర్ణయo తీసుకున్నారు. ప్రస్తుతం 2.38 లక్షల ఎకరాల్లో మిర్చి శాగు అవుతోంది . దానిని 3.5 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయo తీసుకున్నారు ఇక.. పసఱపు పంట ప్రసఱ్తతం 1.34 లక్షల ఎకరాల్లో పండిస్తుండగా … దానిని 1.50 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయo తీసుకున్నారు ఇక.. టమాట పంటను లక్ష ఎకరాల్లో, వంకాయ, ఉల్లి, బెండ, బీన్సస పంటను 30 వేల ఎకరాల చొప్పున, క్యారెటన, క్యాబేజీ, బీర, కాలీఫ్లవరన 20 వేల ఎకరాల చొప్పున పెంచాలని భావించారు. ఇక.. ఆకు కూరల సాగు లక్షన్నర ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇక… పండ్ల తోటలు 3.12 లక్షల ఎకరాల్లో తోటలున్నాయి. అయితే ఇందులో మామిడి పంట అధికం. పాలీహౌజ, ఇతర మార్గాల ద్వారా మరో 50 వేల ఎకరాల్లో ద్రాక్ష, అరటి తోటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.