భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఈ దేశ ఆగ్రహం ఎలా వుంటుందో చూస్తారు
ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అవసరమైతే పాక్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుబెడతామని ప్రకటించారు. పొరుగు దేశాలతో తాము ఎల్లప్పుడూ సత్సంబంధాలనే నెరుపుతాం. కానీ..ఉగ్రవాదుల చర్యలను ప్రతిసారీ భారత్ ఉపేక్షించదన్నారు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఈ దేశ ఆగ్రహం ఎలా వుంటుందో చూడాల్సి వుంటుంది.
-రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి