శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా కన్నుమూత

శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా (71) కన్నుమూశారు. చాలా సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం అర్ధరాత్రి యూపీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన నివాసం రాజ్ సదన్ వద్ద ఆయనకు నివాళులు అర్పించడానికి ప్రజలు, ప్రముఖులు భారీగా తరలివచ్చారు. మరోవైపు తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది.

2020, ఫిబ్రవరి 5 న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ను ప్రకటించారు. ఈ సమయంలోనే శాశ్వత ట్రస్టీగా విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రాను ప్రకటించారు. మరో వైపు ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ పార్లమెంటరీ స్థానం నుండి BSP టికెట్‌పై పోటీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *