అయోధ్య బాల రాముడికి బంగారు రామాయణాన్ని బహుకరించిన భక్తుడు

అయోధ్య బాలరాముడికి ఓ భక్తుడు 5 కోట్లు విలువ చేసే ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధాన ఆలయంలో వుంచారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ లక్ష్మీనారాయణ తన జీవిత సంపాదన మొత్తాన్ని బాల రాముడికి అంకితం చేస్తానని అనుకున్నారు. అనుకున్న మాట ప్రకారం నిల్చున్నారు. మాట ప్రకారం 5 కోట్లతో 151 కిలోల బరువున్న రామచరిత మానస్‌ని తయారు చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. 140 కిలోల రాగిని కూడా వాడారు.

నిజానికి బంగారు పూత పూసిన ఈ పేజీలను వేర్వేరుగా తీసుకొని, అయోధ్యలో బైండిరగ్‌ చేయించినట్లు ట్రస్ట్‌ పేర్కొంది. చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు జ్వెల్లర్స్‌లో ఈ రామచరిత మానస్‌ను రూపొందించారు. ఈ బంగారు రామచరిత మానస్‌ని సెంగోల్‌ రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *