యూనెస్కో జాబితాలో రామచరితమానస్, పంచతంత్రం, సహృదయలోక-లోకన రచనలు

రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోక-లోకన రచనలను యునెస్కో ప్రపంచ ఆసియా-పసిఫిక్ ప్రాంతీయ పట్టికలో చేర్చింది. ఈ రచనలు భారతదేశపు గొప్ప సాహిత్య, సాంస్కృతిక వారసత్వాలకు ప్రతీకలని యునెస్కో తెలిపింది. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో మే 7-8 తేదీల్లో జరిగిన వరల్డ్ కమిటీ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (MOWCAP) 10వ సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు రామచరితమానస్, పంచతంత్రం, సహృదయలోక-లోకన వంటి రచనలు భారతీయ సాహిత్యం, సంస్కృతిని ప్రభావితం చేశాయని పేర్కొంది. ప్రపంచ సాంస్కృతిక పరిరక్షణ ప్రయత్నాలలో భాగంగా అపూర్వమైన సాహిత్య రచనలను గౌరవించడం ద్వారా, విశిష్ట రచనలను భవిష్యత్ తరాలకు అందిచవచ్చని పేర్కొంది. కాగా రామచరితమానస్ ను తులసిదాస్ రచించారు. పంచతంత్రను విష్ణు శర్మ సహృదయలోక-లోచనను ఆచార్య ఆనందవర్ధన్ రచించారు. మరో వైపు ఈ మూడు గ్రంథాలు కూడా భారతీయ సాహిత్యం, సంస్కృతిని  లోతుగా ప్రభావితం చేశాయని కేంద్ర సాంస్కతిక శాఖ పేర్కొంది. దేశ నైతిక విలువలు, కళాత్మక వ్యక్తీకరణలను లోతుగా చేసే గ్రంథాలని, ఇవి శాశ్వతమైనవి తెలిపింది. యునెస్కో గుర్తింపు ద్వారా ఇటు భారతీయులకు, ప్రపంచ ప్రజలకు కూడా ఓ మంచి గుర్తును మిగిల్చిందని హర్షం  వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *