కరాచీ, లాహోర్ లో గురుకులాలు తెరవాల్సి రావొచ్చు : రాందేవ్ బాబా
పాకిస్తాన్ పతనం అంచున వుందని, అందుకే భారత్ తో పూర్తి స్థాయిలో తలపడదని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ లో అంతర్గతంగా కొన్ని విభజనలు వచ్చాయని, అవి అక్కడి ప్రభుత్వానికి పెను సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఇందుకు ఆయన బలూచిస్తాన్ ఉద్యమాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ‘‘పాకిస్తాన్ తనంతట తాను విచ్ఛిన్నం అంచుల్లోకి వెళ్తోంది. బలూచిస్తాన్, పఖ్తూన్ ప్రజలు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు. పీఓకేలో పరిస్థితి మరింత దారుణంగా వుంది. భారత్ ను ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్ కి లేనేలేదు. భారత్ తో కనీసం నాలుగు రోజులు కూడా పాక్ యుద్ధం చేయలేదు’’ అని రాందేవ్ బాబా అన్నారు.పాకిస్తాన్ లో పరిస్థితులు ఎలా వున్నాయంటే.. త్వరలోనే తాను కరాచీ, లాహోర్ లో గురుకులాలను తెరవాల్సి రావచ్చని రాందేవ్ బాబా అన్నారు.