రాణి గైడిన్లియు- పర్వత పుత్రిక

మన దేశంలో చాలామంది భారత స్వాతంత్య్రోద్యమకారులలాగే, ఈమె చరిత్ర కూడా మరుగున పడిపోయింది.2014 మే 4న ఈమె జన్మ వార్షికోత్సవం జరపడానికి, గౌహతిలో ‘రాణి గైడిన్లియు జాతీయ స్మారక కమిటీ’ ఏర్పాటు చేసిన తరువాతే స్వాతంత్య్రోద్యమంలో ఈమె వీరవృత్తాంతం, ఆధ్యాత్మిక పునరుద్ధరణలో ఈమె పాత్ర ప్రజలకు పరిచయమయ్యాయి.

చాలా చిన్నవయసులోనే రాణి గైడిన్లియు, తన నాగా జాతి ప్రజలను ఉద్బోధిస్తూ, బ్రిటిషు రాచరికాన్ని ఎదిరించింది. ‘మన నాగా జాతీయులు స్వతంత్రులు, మనని ఏలడానికి, మనచేత బలవంతంగా పన్నులు కట్టించుకుని, నిర్బంధ కార్మికులుగా మనచేత వెట్టిచాకిరి చేయించుకునే తెల్లదొరలను మన పాలకులుగా మనం గుర్తించము, మనపై వారికి ఎటువంటి అధికారం లేదు’ అని ఆమె బ్రిటిషువారిని ఎదిరించడంతో, బ్రిటిష్‌ పార్లమెంటు ఆమెని ‘ఈశాన్య భారత ఉగ్రవాది’ గా అభివర్ణించింది! ఈ వీరవనితను గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం, భారతజాతికి గర్వకారణం.

సంఘర్షణ

పురాతన నాగాజాతి సంప్రదాయాల స్ఫూర్తితో, అన్ని నాగావర్గాలను కలిపి ‘హైపోజడోనాంగ్‌’ బ్రటిషువారిని ఎదిరించి పోరాడాడు. బ్రిటిష్‌ పాలకులు ఫిబ్రవరి 1931లో ఆయనను అరెస్ట్‌ చేసి, 29ఆగస్ట్‌ 1931 తేదిన ఇంఫాల్‌ జైలులో ఉరి తీసారు. ఆయన మరణంతో, ఉద్యమం నాయకత్వం 16సం రాణి గైడిన్లియు పైబడిరది. ఆమె తన ‘జేలియనగ్రోంగ్‌’ వర్గాలను కూడదీసి, బ్రిటిషువారికి పన్నులు చెల్లించవద్దని కోరి, దేశ స్వాతంత్య్రానికై పోరాడిరది. ఆమె మాటమీద అన్ని నాగావర్గాలు, బ్రిటిష్‌ పాలకు లను ఎదిరించి సహాయ నిరాకరణ ప్రారంభించారు.

రాణి గైడిన్లియుని అరెస్ట్‌ చేయడం కొరకు, పాలకులు ప్రతి గ్రామం, కొండగుట్టలు గాలించారుÑ కాని ఆమె తన అనుయాయులతో కలిసి, ఈనాటి ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్‌, మణిపూర్లలో, పర్వతశ్రేణులలో రహస్యంగా తిరుగుతూ, బ్రిటిషు పాలకులను ఎదిరించే ఉద్యమకారులుగా ప్రజలను తీర్చిదిద్దింది. ఈశాన్యంలో పెరుగుతున్న ఉద్యమాన్ని అణిచి వేయడానికి, బ్రిటిష్‌ ప్రభుత్వం ‘అస్సాం రైఫిల్స్‌’ కెప్టెన్‌ మక్డోనాల్డ్‌ నాయ కత్వంలో సైన్యాన్ని పంపించి, గాలించి, ‘పులోమి’ గ్రామంపై దాడిచేసి, సైన్యంతో ఆమెని చుట్టుముట్టి 17అక్టోబర్‌1932 తేదిన నిర్బంధించారు. పదినెలలు జరిగిన కోర్టు విచారణలో, ‘సైన్యంపై దాడి, హత్యా’ నేరాలకింద, ఆమెకు బ్రిటిష్‌ ప్రభుత్వం జీవిత ఖైదు విధించింది. 1933 – 1947 మధ్య కాలంలో, గువహతి, షిల్లాంగ్‌, అయిజాల్‌, తురా జైళ్లలో ఆమె కారాగార శిక్ష అనుభవించారు. 14 సంవత్సరాలు కారాగార శిక్షానంతరం, దేశ స్వాతంత్య్రం తరువాత 1947లో తురా జైలు నుంచి ఆమె విడుదలయారు.

స్వాతంత్య్రానంతరం అన్ని నాగా ‘జేలియన గ్రాంగ్‌’ వర్గాలను రాణి గైడిన్లియు ఒకతాటిపైకి తీసుకురావడం, నాగా సంప్రదాయ ‘హెరాకా’ మతాన్ని ఆమె తిరిగి పునరుద్ధరించడం చూసి, ‘ఏ.జెడ్‌.ఫిశో’ నాయకత్వంలోని వేర్పాటువాద ‘నాగా నేషనల్‌ కౌన్సిల్‌’ భరించలేకపోయింది. అప్పటికే విపరీతంగా వ్యాపించిన మతమార్పిడుల వల్ల బలపడిన ‘నాగా చర్చ్‌’, రాణి గైడిన్లియు నాగా సాంప్రదాయ పునరుద్ధరణను ఖండిస్తూ, ఇది క్రైస్తవానికి వ్యతిరేకమని ప్రచారం చేసారు.

జాతీయ సంస్థలతో అనుబంధం:

రాణి గైడిన్లియు ఎల్లప్పుడూ, ఇతర జాతీయ సంస్థలు- వనవాసీ కళ్యాణ్‌ ఆశ్రమం, విశ్వ హిందూ పరిషద్‌, విద్యా భారతి సంస్థలతో అనుబంధంగా పనిచేసారు. 1969 ‘జోర్హాట్‌’లో జరిగిన హిందూ సదస్సులో ఆమె ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు శ్రీ ఎంఎస్‌ గోళ్వాల్కర్‌ను కలిసారు. జనవరి 1979లో ప్రయాగరాజ్‌లో జరిగిన 2వ ప్రపంచ హిందూ సదస్సుకి వారు హాజారయారు. ఆమె దేశమంతా పర్యటించి, నాగాలు వేర్పాటువాదులు కాదని వారిలో అధిక శాతం హిందువులేనని, భారాత దేశంలోనే జీవించాలని కోరుకుంటున్నారు అని ప్రజలకు తెలియచేసారు. అఖిల భారత స్వాతంత్య్రోద్యమకారుల సంఘానికి ఆమె అధ్యక్షులుగా కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *