రాణి పద్మిని కోరుకున్నది బలవన్మరణం కాదు, అమరత్వం
ముస్లిం దురాక్రమణకారుడైన అల్లాఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించుకున్నప్పుడు భయంతో రాణి పద్మిని మంటల్లో దూకి ఆత్మహత్య (జోహర్) చేసుకుందని చాలామంది ప్రచారం చేశారు. కానీ చరిత్రలో నిజాలు మరోలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.
మేవార్ రాజైన మహారావల్ రతన్ సింగ్ భార్య రాణి పద్మిని. అల్లావుద్దీన్ ఖిల్జీ వారు నివసించే చిత్తోడ్ గఢ్ దుర్గాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్లుగా రాణి పద్మినిని సొంతం చేసుకునేందుకే ఖిల్జీ వారి కోటపై దాడి చేశాడు. కానీ ఈ ప్రచారం సరైనదికాదు.
అసలు విషయం ఏమిటంటే, మధ్యయుగపు యుద్దాలు కేవలం అందమైన రాణుల కోసం మాత్రమే జరిగినవి కావని తెలుసుకోవాలి.
చిత్తోడ్ గఢ్ కేవలం ఒక కోట కాదు. 700 ఎకరాలలో విస్తరించిన ఒక భవ్యమైన నగరం. దానిని 180 మీటర్ల ఎత్తున కొండ పై నిర్మించారు. ఏ మధ్యయుగపు కోటతో పోల్చినా అది చాలా అద్భుతమైనది, ప్రత్యేకమైనది. 7వ శతాబ్దం నుండి కొనసాగుతున్న హిందూ సామ్రాజ్యానికి అది కేంద్రం. ఎంతటి సుదీర్ఘమైన ముట్టడినైనా తట్టుకో గలదు ఆ కోట. లోపల ఉన్న చెరువులు, బావులు 50 వేల సైన్యానికి ఒక సంవత్సరం పాటు దాహార్తి తీర్చగలవు. రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతం, నీటి కొరతతో చూస్తే ఈ కోట ఎంత విలువైనదో, ప్రత్యేక మైనదో అర్ధమవుతుంది. అందుకనే ఆ కోట ఒక సామ్రాజ్యానికి కేంద్రమయ్యింది. అది ఎవరి చేతిలో ఉంటే ఆ మొత్తం ప్రాంతం వారిదవుతుంది. ఇప్పుడు అర్ధమయ్యేఉంటుంది ఖిల్జీ ఆ కోటను ఆక్రమించేం దుకు ఎందుకంత ప్రయత్నించాడో.
ఖిల్జీ పరమ కర్కోటకుడు, దుర్మార్గుడు. పసిపిల్లలను వారి తల్లుల ముందే నిర్దాక్షిణ్యంగా హతమార్చి రాక్షసానందం పొందినవాడు. 20వేల మంది హిందువుల పుర్రెలతో ఎముకల గోపురాలను కట్టి గర్వించిన వాడు. ఇక ‘శృంగార జీవితానికి’ వస్తే ఖిల్జీ స్వలింగ సంపర్కం, పిల్లలపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. నిజంగా రాణి పద్మినే కావాల్సివస్తే ఆమెను ఎత్తుకుపోవడానికి, మాయంచేయడానికి అంతటి శక్తివంతమైన సుల్తాన్ ప్రయత్నించడా?
మహారావల్ రతన్ సింగ్, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య యుద్దం 8 నెలలు సాగింది. సుదీర్ఘకాలం పాటు చిత్తోడ్ గఢ్ ముట్టడిలో ఉంది. చివరికి జరిగిన ప్రత్యక్ష యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ రతన్ సింగ్, ఆయన ముఖ్య అనుచరులు వీర మరణం చెందారు.
అలా రాజు యుద్ధభూమిలో చనిపోతే ఏం జరుగుతుంది? ఒక సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయాలని దాడి చేసిన దురాక్రమణ దారుడు ఆ రాజ్యపు పాలకుడిని చంపేసి ఊరుకుంటాడా? యుద్దభూమిలో విజయం కంటే ప్రత్యర్ధిపై మానసికమైన విజయం సాధించడానికే దురాక్రమణదారుడు ప్రయత్నిస్తాడు. ఆధునిక కాలంలో కూడా దేశాలు ఇదే సూత్రాన్ని పాటిస్తుం టాయి. ప్రత్యర్థిని భయబ్రాంతులలో ముంచేందుకు, లొంగిపోయేట్లు చేసేందుకు వారి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. అందుకనే పాలకుల కుటుంబాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తుంటారు.
రతన్ సింగ్ చనిపోయిన తరువాత ఖిల్జీ కోటనైతే జయించాడు. కానీ దోపిడీకి, దుర్మార్గాలకి అలవాటుపడిన తన సైనికుల ఆకలి తీరడం ఎలా? కోటను దోచుకోమని, కనిపించిన మహిళపై అత్యాచారానికి పాల్పడమని అనుమతి ఇచ్చి వుంటాడు. ఎందుకంటే మధ్యయుగపు దురాక్రమణ దారులు అనుసరించిన యుద్ధ నీతి అదేమరి. ఆ సేనలు శవాలపైన కూడా అత్యాచారాలకు పాల్పడెవన్నది చరిత్ర చెపుతున్న సాక్ష్యం.
రాణి పద్మిని సామాన్య స్త్రీ కాదు. ఆమె శౌర్యవంతుల వంశానికి చెందినది. రాజు మరణం తరువాత కోటలో ఉన్న తనతో పాటు వందలాది మంది స్త్రీల పరిస్థితి ఏమిటో, తాము ఎలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందో ఆమెకి బాగా తెలుసు. మొదట సుల్తాన్, అతని ప్రధాన సేనానులు, ఆ తరువాత ఆఖరి సైనికుడి వరకు అందరి చేతిలో ఘోరమైన అత్యాచారాలు, అవమానాలు తప్పవని తెలుసు. ఘోరమైన అత్యాచారాలు, అవమానాల తరువాత కూడా బతికున్న స్త్రీలను బందీలుగా పట్టుకుపోతారు. సెక్స్ బానిసలుగా అమ్మివేస్తారు.
అందుకే రాజపుత్ర ప్రతీకార జ్వాలను ప్రజ్వలింపచేయాలని, ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని అనుకుంది. అందుకు ఒక నిర్ణయం తీసుకుంది.
ఆమె అనుకున్నది అక్షరాల నిజమైంది. ఖిల్జీ ఆక్రమణతో చిత్తోడ్ గఢ్ పౌరుషం, పరాక్రమాలు అడుగంటిపోలేదు. రాణి పద్మిని జ్వలింపచేసిన స్వాభిమాన జ్వాల వ్యర్ధం కాలేదు. పదేళ్ళ లోపునే రాజపుత్ర శిసోడియాలు కోటను మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత చిత్తోడ్ గడ్డ రాణా సంగ్రామ్ సింగ్, రాణా ఉదయ్ సింగ్, రాణా కుంభ వంటి ఎంతోమంది హిందూ వీరులు, పరిపాలకులకు జన్మనిచ్చింది. వారంతా చిత్తోడ్ కీర్తిని దశదిశలా వ్యాపింపచేశారు.
అలా రాణి పద్మిని ఎంచుకున్నది చావును కాదు, అమరత్వాన్ని.