వేగంగా సంఘకార్య విస్తరణ
(హర్యానాలోని సమల్ఖాలో (మార్చ్ 12-14) జరిగిన అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాల్లో సర్ కార్యవాహ సమర్పించిన వార్షిక నివేదిక)
పని విస్తరణలో సంఘం ఈ సంవత్సరం విజయవంతమైంది. కోవిడ్ సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొంటూ, దానిని ఓడిరచడంలో విజయం సాధించాము. సవాళ్లలో కూడా పనిచేసిన అనుభ వాల నుండి చాలా పాఠాలు నేర్చుకున్నాము. అనుకూలమైన పరిస్థితిని సద్వినియోగం చేసుకుని, మన కార్యకర్తలు అనేక ప్రశంసనీయ మైన ప్రయత్నాలు చేశారు. దేశం నలుమూలల నుంచి 34 సంస్థలకు చెందిన 1474 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కార్య స్థితి :
శిక్షావర్గలు :
గత ఒక సంవత్సరంలో 121,137 మంది యువకులు సంఘ ప్రాథమిక శిక్షణను పొందారు.
శాఖల వివరాలు :
దేశమంతటా మొత్తం 42,613 స్థానాల్లో 68651శాఖలు జరుగుతున్నాయి. (గత సంవ త్సర సంఖ్య 37903 స్థానాల్లో 60,117). సాప్తాహిక్ (వారానికి ఒకసారి జరిగేవి) 26,877 (గత ఏడాది 20,826). సంఘమండలి (నెలకు ఒకసారి జరిగేవి) 10, 412 (గత సంవత్సరం 7980).
సర్ సంఘచాలక్‌జీ పర్యటనలు
2022-23 సంవత్సరంలో పరమ పూజనీయ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ జీ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలను సందర్శించారు. విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన మేధావులను కలుసుకున్నారు. ప్రముఖ సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఢల్లీి, చెన్నై, కలకత్తా, ముంబైలలో వివిధ రంగాలలోని ప్రముఖు లతో సమావేశాలు, పరస్పర చర్చా కార్యక్రమాలో పాల్గొన్నారు. బెంగళూరు, ఢల్లీిలో యువ పారిశ్రామికవేత్తలతో సమావేశ మయ్యారు.
సంఘమిత్ర సేవ ప్రతిష్ఠాన్, సేవిక ప్రకాశన్ ద్వారా ప్రచురించిన ఆల్ ఇండియా మహిళా చరిత్ర కోష్ పుస్తకం మొదటి సంపుటాన్ని 2022 ఆగస్టు 17న పూజనీయ సర్ సంఘచాలక్ జీ ఆవిష్కరిం చారు. అక్టోబర్ 9న కాన్పూర్‌లో జరిగిన భగవాన్ వాల్మీకి జయంతి కార్యక్రమంలో, నవంబర్ 27న ఉత్తర బీహార్‌లోని మల్ఖాచక్‌లో స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను సత్కరించే కార్యక్రమంలో, డిసెంబర్ 21న కర్ణావతిలో జరిగిన స్వామి నారాయణ్ సంస్థ అధిపతి ప్రముఖ్ స్వామి మహరాజ్ జీ శతాబ్ది సంవత్సర కార్యక్రమా లల్లో సర్ సంఘచాలక్ జీ పాల్గొన్నారు.
తమ పర్యటనలో సర్ సంఘచాలక్ జీ కేరళ లోని మాతా అమృతానందమయి ‘‘అమ్మ’’, అహ్మదాబాద్‌లోని రత్నసుందర్ సూరిజీ మహ రాజ్, చిత్రదుర్గకు చెందిన మదార చన్నయ స్వామీజీ వంటి పూజనీయుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులను సర్ సంఘచాలక్ జీ మర్యాద పూర్వకంగా కలిశారు. వారిలో ప్రముఖులు బెంగళూరులో శ్రీ అజీమ్ ప్రేమ్‌జీ, ముంబైలో శ్రీ అర్ధేందు బోస్, శ్రీ విశాద్ మఫత్‌లాల్, శ్రీ ఆదినాథ్ మంగేష్కర్, త్రిపురలో రాజమాత విభు దేవి జీ, ఢల్లీిలో మౌలానా ఉమర్ ఇల్యాసి, ూ. ు. ఉష, క్రికెటర్ రవీంద్ర జడేజా, పతంజలి యోగ పీఠ్ ఆచార్య బాలకృష్ణన్, గాయకుడు రషీద్ ఖాన్, సినీ నటుడు అక్షయ్ కుమార్‌లు ఉన్నారు.
ప్రచార విభాగం :
చెన్నై, నాగ్‌పూర్, చండీగఢ్. లక్నో, గౌహతి నగరాల్లో వివిధ మీడియా సంస్థల సంపాదకులు, రాష్ట్రాల ఛీఫ్‌లతో అనధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ సబళే జీ పాల్గొన్నారు. ఇందులో 92 మంది ప్రముఖ మీడియా ప్రతినిధులు హాజర య్యారు. డిసెంబరు 26న ఢల్లీిలో సర్ కార్యవాహ జీ సమక్షంలో 38 మంది విదేశీ మీడియా ప్రతినిధుల సమావేశం జరిగింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన కాలమిస్టుల సమావేశం ఆగస్టు 20, 21 తేదీల్లో ఢల్లీిలో జరిగింది. ఈ సమావేశా నికి 49 మంది కాలమిస్టులు హాజరయ్యారు. మాననీయ సహ సర్ కార్యవాహలు డాక్టర్ కృష్ణ గోపాల్ జీ, డాక్టర్ మన్మోహన్‌వైద్య జీ, శ్రీ అరుణ్‌కుమార్ జీ ప్రసంగించగా, ముగింపు సమా వేశంలో మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయజీ మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా వివిధ వేదికలలో చురుకైన, ప్రభావవంతమైన వ్యక్తుల సమావేశం గ్రేటర్ నోయిడాలో అక్టోబర్ 1,2 తేదీల్లో జరిగింది. ఇందులో 19 ప్రాంతాల నుంచి 69 మంది హాజ రయ్యారు. మాననీయ సర్ కార్యవాహ జీ, మాననీయ సహ సర్ కార్యవాహలు మార్గదర్శనం చేశారు. వివిధ సంస్థలకు చెందిన అఖిల భారత స్థాయి కార్యకర్తల సమావేశం రెండు రోజులు ఢల్లీిలో జరిగింది. 30 సంస్థల నుండి 68 కార్యకర్తలు హాజరయ్యారు. తెలంగాణ, మాల్వా, జైపూర్, చిత్తోర్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మీరట్, బ్రజ్, దక్షిణ బీహార్ ఉత్తర బెంగాల్, సెంట్రల్ బెంగాల్, ఉత్తర అస్సాం, దక్షిణ అస్సాం, మణిపూర్ ప్రాంతంలో సాహిత్య విక్రయ ప్రచారాన్ని చేపట్టారు. ఆయా ప్రాంతాలలో జాగరణ పత్రిక చందాదారులను పెంచడం కోసం, పత్రికా విస్తరణ ప్రణాళికపై పలు సమావేశాలు నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వ హించి, విజయం సాధించారు. ‘‘జంగిల్: సత్యాగ్రహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు’’ అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. చిత్తోడ్ ప్రాంతంలో ఆరావళి మోషన్, విశ్వసంవాద కేంద్రం, ఉదయ్ పుర్ ప్రచార విభాగం సంయుక్తంగా మేవాద్ టాక్‌ఫెస్ట్ ఫోరమ్ 2023 పేరుతో సమావేశాన్ని నిర్వహించారు.
ప్రత్యేక కార్యక్రమాలు :
తెలంగాణ ప్రాంతం కూకట్‌పల్లి భాగ్‌లో డిసెంబర్ 25 జరిగిన ‘‘మహా సాంఫీుక్’’లో భాగ్ లోని 101 బస్తీలలో ఒక్కొక్కటి చొప్పున 101 శాఖలు ఒకే చోట నిర్వహించారు. ఇందులో 1060 మంది తరుణ, 624 మంది బాల స్వయం సేవకులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర అమృత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కర్నూలు విభాగ్‌లోని 914 గ్రామాలకు గాను 802 గ్రామాలలో ‘‘దేశం కోసం ఒక్క రోజు’’ అనే పేరుతో కార్యక్రమం చేశారు. 494 గ్రామాల్లో భారత్ మాతా పూజ నిర్వహించారు. ఇందుకోసం 2163 కార్యకర్తలు, 598 అల్పకాల విస్తారక్‌లు 74,943 కుటుంబాలను కలిశారు. 92500 కరపత్రాలు, స్టిక్కర్లు పంపిణీ చేశారు.
జనవరి 23, 2023న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఉత్తర బంగా ప్రాంతంలోని 72 ఖండలు, 20 నగరాలు, 9 ఉప నగరాలతో సహా మొత్తం 101 ప్రదేశాలలో పథసంచలన్ జరిగింది. ఇందులో 2509 గణవేష్ దారి స్వయంసేవకులు, 2040 మంది సాధారణ స్వయంసేవకులు పాల్గొన్నారు. 25 చోట్ల ఘోష్ (బ్యాండ్) లతో పథ సంచలన్ జరిగింది. అలాగే జనవరి 12న 407 మండలాలు, 230 బస్తీలలోని 1087 చోట్ల భారత మాతా పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 24,976 మంది పాల్గొన్నారు. కోంకన్ విభాగ్‌లో సర్ సంఘచాలక్ పర్యటన దృష్ట్యా జనవరి 7న ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 37 శాఖలు, 77 సాప్తాహిక్ మిలన్లు నుంచి స్వయంసేవకులు పాల్గొన్నారు. జనవరి 20న పంజాబ్‌లోని జలంధర్ మహానగర్‌లోని స్వయంసేవకుల సమ్మే ళనం ఏర్పాటు చేశారు. 11 మండలకు చెందిన 56 శాఖలు, 9 సాప్తాహిక్ మిలన్లు, 3 విశ్వవిద్యాల యాలు, 4 కళాశాలల నుంచి 1866 మంది స్వయంసేవకులు హాజరయ్యారు. దట్టమైన పొగమంచులో మాననీయ సర్ కార్యవాహ జీ ఈ సందర్భంగా ప్రసంగించారు.