ప్రతి యువతి ఉత్తమ పౌరురాలు కావాలి
– సునీలా సోవనీ జీ
ప్రతి యువతి ఉత్తమ పౌరురాలు కావాలని, స్వశక్తి, ఆత్మనిర్భురాలు కావాలనేదే సేవికా సమితి ఆకాంక్ష అని రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ ప్రచార ప్రసార ప్రముఖ్ మాననీయ సునీలా సోవనీ గారు అన్నారు.
మే 21న భాగ్యనగర్‌లోని ఖైరతాబాద్ శిశుమందిర్ లో జరిగిన రాష్ట్రసేవికా సమితి ప్రవేశ శిక్షావర్గ సమారోప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సేవిక సమితి ప్రవేశ శిక్షావర్గ బాలికలకు స్వరక్షణ, క్షమతతో పాటు సమాజసేవ జాగరణ కార్యక్రమాలలో పనిచేసే ప్రశిక్షణ ఇస్తుందన్నారు. ప్రతి క్షేత్రంలో మహిళలకు అవకాశం ఉండాలని వారు వ్యవస్థితంగా నిర్వహణ చేయాలనేది సమితి అపేక్ష అని మహిళలను స్వశక్తులుగా చేయడం ద్వారానే దేశాన్ని తేజోవంతం చేయలమనేది సమితి లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
స్వార్గజనికోత్సవంలో ముఖ్యతిథిగా విచ్చేసిన డా. కె.ఎం.సుమలతగారు మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్న అత్యంత భయానక పరిస్థితులను చూసి మనసులో భయం కలిగేది కాని ఈ వర్గలో సేవికులు ప్రదర్శించిన శారీరిక, శస్త్ర విన్యాసాలను చూసిన తర్వాత ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం పెంచు కోగలమనే ధైర్యం కల్గిందని, మారుతున్న కుటుంబ పరిస్థితులు, నిస్సార విద్యా వ్యవస్థలను దారిలో పెట్టే బాధ్యత మనదేనని వారు అన్నారు.
ప్రవేశ శిక్షావర్గ ఖైరాతాబాద్ శిశుమందిర్‌లో మే 6 నుంచి 21 వరకు 15 రోజుల పాటు జరిగింది. తెలంగాణ ప్రాంతంలోని 26 జిల్లాల నుండి 116 మహిళలు పాల్గొన్నారు. బాలికలకు శారీరక్, మానసిక, బౌద్దిక వికాసం జరగాలనే ఉద్దేశంతో ఈ 15రోజులు శిక్షణ నిచ్చారు.
ఈ వర్గలో సమితి ప్రముఖుల మార్గదర్శనం లభించింది.