గణతంత్ర మండపం, అశోక మండపం అంటూ రాష్ట్రపతి భవన్ హాల్ పేర్ల మార్పులు
రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్, అశోక్ హాల్‌కు కొత్త పేర్లు పెట్టారు. గణతంత్ర మండపం, అశోక మండపంగా మార్చారు. దర్భార్ హాల్, అశోక హాల్ పేర్లు మార్చినట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయం అధికారులు వెల్లడించారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరగా ఉండే విధంగా రాష్ట్రపతి భవన్‌లోని దర్భార్ హాల్, అశోక హాల్ పేర్లను మార్చారు. బ్రిటిష్ కాలంలో రాజదర్పం ప్రదర్శించేలా నామకరణాలు చేశారు. నేడు వాటికి చెరమగీతం పాడారు.
జాతీయ అవార్డుల ప్రదానం లాంటి ప్రధాన వేడుకులను ఈ దర్బార్ హాలులోనే నిర్వహిస్తుంటారు. ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర భావన భారత సమాజంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపం సరైంది అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థమని , అలాగే భారత చరిత్రలో అశోక చక్రవర్తి, సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్టా దానికి అశోక మండపం అని మార్చినట్లు అధికారులు వివరించారు.