అయోధ్యలో దేశ క్షేమం కోసం మంచి పనులు నడుస్తున్నాయి : రవి శంకర్
ఆనందమయ జీవితానికి ఆధ్యాత్మికతే సాధనమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. సంతోషానికి అవధులు లేవని, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందన్నారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించుకున్నామని, దేశ సంక్షేమానికి అనేక మంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. మంచి మార్గం వైపు నడిస్తే, ఎప్పుడూ విజయమే వరిస్తుందన్నారు. ఒత్తిడి లేకుండా జీవించాలంటే కొన్ని మార్పులు అవసరమని, ప్రజా శ్రేయస్సు కోసం మంచి మార్గంలో నడవాలన్నారు.