రాజకీయ అనివార్యతల వల్లే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు : రవిశంకర్ ప్రసాద్

కేంద్ర ప్రభుత్వం లోకసభలో వక్ఫ్ సవరణ బిల్లుని నేడు ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు దీనిని ప్రవేశపెట్టారు. బీజేపీ పక్షాన సీనియర్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థం పర్థంలేని వాదన అని కొట్టి పారేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ని ఉటంకిస్తూ.. విపక్షాల వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఒక్కో పాయింట్ ఆధారంగా పక్కాగా జవాబునిచ్చారు.
వక్ఫ్ బిల్లు వెనుకబడిన ముస్లింల కోసం, ముస్లిం మహిళల అభ్యున్నతి కోసం ఉపయోగపడుతుందన్నారు. కేవలం రాజకీయ అనివార్యతల కారణంగానే విపక్షాలు వక్ఫ్ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.బిల్లుకు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షం పదపదే అభ్యంతరాలు చెబుతుండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ముస్లిం కమ్యూనిటీ సంక్షేమం నుంచి ఏ అనివార్యతల కారణంగా వెనక్కి మళ్లారని ప్రశ్నించారు.
రవిశంకర్ ప్రసంగంలోకి ముఖ్యాంశాలివీ…
1. రాజ్యాంగం రెడ్ కాపీని చేతిలో పట్టుకొని తేవడం ఓ ట్రెండ్ అయ్యింది. కానీ… ఇక్కడే పార్లమెంట్ లో గ్రీన్ కాన్‌స్టిట్యూషన్ బుక్ వుంది.
 
2. -మహిళల సంక్షేమానికి చట్టాలు తీసుకురావచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెబుతోంది. అప్పుడు ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుంది? ఈ బిల్లు వెనుకబడి ముస్లింల స్థితిని మెరుగుపరేచేందుకు ఉద్దేశించినది.
 
3.-రాజ్యాంగాన్ని చూపిస్తూ ఆర్గుమెంట్లు చేసే విపక్షాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలతోనే నేను సమాధానిమిస్తున్నాను.
 
4.వక్ఫ్ మతపరమైన సంస్థ కాదు, కేవలం చట్టబద్ధమైన సంస్థ.
 
5.-దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా వక్ఫ్ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఎన్ని స్కూళ్లు, అనాథాశ్రమాలు, నైపుణ్య కేంద్రాలు, ఆసుపత్రులు నిర్మించారు?
 
6. -సంస్కరణలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు విపక్షాలు చెబుతున్నప్పటికీ రాజకీయ అనివార్యతల కారణంగానే సంస్కరణలను విభేదిస్తున్నాయి.
 
7.370వ అధికరణను రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా హింసకు దారితీయవచ్చని విపక్షాలు వాదించాయి. కానీ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అసాధారణ రీతిలో అభివృద్ధి జరిగింది. ఉద్యోగావకాశాలు కలిగాయి.
 
8. -ముస్లిం కమ్యూనిటీ ఆదర్శాలు అబ్దుల్ కలాం ఆజాద్, ఏపీజే అబ్దుల్ కలామ్, అష్పఖ్ ఉల్లా ఖాన్, మొహమ్మది షమి తరహాలో ఉండాలి. 25-30 ఏళ్ల తర్వాత ఓట్ల వ్యాపారం మానేయాలని మనం ఆలోచించాలి. కానీ ఆ ఆలోచన నుంచి వాళ్లు (విపక్షాలు) బయటకు రావడం లేదు.
 
9. దేశం మారుతుంటే కాంగ్రెస్ చూస్తూ నిల్చుండిపోయింది. వాళ్లెక్కడున్నారు? ఎన్ని సీట్లు వచ్చాయి?
 
10. నేను ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు గురించి చెప్పాలనుకుంటున్నాను. ట్రిపుల్ తలాఖ్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నప్పుడు, తీర్పును ఇవ్వవద్దని, నిఖానామాను సిద్ధం చేసి దేశమంతటా ప్రచారం చేస్తామని, నిఖా (ముస్లింల వివాహ) సమయంలో ట్రిపుల్ తలాఖ్‌ని నిషేధిస్తూ తామే ఒక నిబంధనను చేర్చుతామని ముస్లిం పర్సనల్ లా బోర్డు కోర్టుకి చెప్పింది. కానీ, గుర్తుంచుకోండి… ఈ ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని సభ ఆమోదించినప్పుడు ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ చట్టాన్నివ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *