శ్రీశైలం మహా క్షేత్రంలో బయటపడిన 14 వ శతాబ్దపు లింగం

శ్రీశైలం మహా క్షేత్రంలో 14 వ శతాబ్దం నాటి ఓ శివలింగం బయటపడిరది. యాంపీ థియేటర్‌ సమీపంలో  ఈ ఘటన జరిగింది. ఈ థియేటర్‌ సమీపంలో భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం  అధికారులు  సీ సీ రోడ్డు, సపోర్టు వాల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే జేసీబీ  సాయంతో తవ్వకాలు చేస్తుండగా … ఈ పురాతన శివలింగం బయటపడింది. పరిసారాలను  చదును చేస్తుండగా … శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు నందీశ్వరుడి విగ్రహం కూడా కనిపించింది. మరోవైపు శివలింగం పక్కనే తెలియని ఓ లిపితో వున్న శాసనాన్ని కూడా గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు.
దీనిని ఫొటోలు తీసి, ఆర్కియాలజీ విభాగం మైసూరుకి పంపారు. ప్రాథమికంగా మాత్రం సారంగధర మఠం, రుద్రాక్ష మఠం మధ్య వున్న చక్రగుండం వద్ద కపిలయ్య శివలింగం, నందిని ప్రతిషష్ఠంచినట్లు ఆ శాససల్లో వుందని తేలింది. అయితే.. గతంలో ఇదే ప్రాంతంలో చతుర్ముఖ లింగం కూడా దొరికింది. గతంలో పంచమఠాన్ని పునరుద్ధరించే ససయంలో అనేక రాగి శాసనా లు, బంగారు, వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. అయితే.. తాజాగా ఈ శివలింగం బయటపడటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ శివలింగాన్ని చూసేందుకు  చాలా మంది భక్తులు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *