మైనారిటీ వర్గాలపై ఆదివాసీల తీర్మానాలు

ఆదివాసి యువకుడైన మర్సుకోల లక్ష్మణ్‌పై గిరిజనేతర వర్గం దాడి చేయడం ఆదివాసీ అస్థిత్వంపై జరిగిన దాడేనని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీ సమాజంపై దాడిచేసినవారు, వెనుక నుండి దాడి చేయించిన వారు ఎంతటివారైనా వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్యానేరం కింద వెంటనే కేసు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలను పోలీస్‌ వారికి అందించారు. జైనూర్‌ ఘటన నేపథ్యంలో దాడికి నిరసనగా శనివారం కుమ్రంభీం జిల్లా సిర్పూర్‌-యు మండలంలో మహగాంవ్‌ శ్రీ గోండ్వానా పంచాయితీ రాయిసెంటర్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసులు తీర్మానాలు చేసి పోలీసు ఉన్నతాధి కారులకు అందించారు. ఇలాంటి ఘటనలు ఏజెన్సీలో మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పట్టుబట్టారు.

ఆదివాసీ న్యాయవ్యవస్థలో చర్చించిన అంశా లను, పలు డిమాండ్‌లను తీర్మానాల రూపంలో పోలీసువారికి ఇచ్చామని, వాటిని పోలీసులు నిశితంగా పరిశీలించి, చర్చించి తగుచర్యలు తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదని ఆది వాసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితులు ప్రశాం తంగా మారేందుకు గాను జైనూర్‌ మార్కెట్‌ను మరికొన్ని రోజులు బంద్‌ చెయ్యాలని ఈ తీర్మానంలో మరో ముఖ్యమైన డిమాండ్‌ ఉన్నప్పటికీ పోలీసు శాఖ ఆదివాసీ డిమాండ్లను ప్రక్కన పెట్టి జైనూర్‌ మార్కెట్‌ బంద్‌ చేయలేమని, ఎవరైనా బంద్‌ చేస్తే చర్యలు తీసుకుంటామని, అడ్డుకోవద్దని చెప్పడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన వర్గాన్ని వెనుకేసుకురావడం ఎంతవరకు సమంజస మంటూ అధికారులు ఆదివాసీల పక్షాన నిల బడటం లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆది వాసులు తేల్చి చెబుతున్నారు.

తమకు భావప్రకటన స్వేచ్చను ఇవ్వడం లేదని, భారత రాజ్యంగంలోని షెడ్యూల్డ్‌ ఏరియాలో భాగంగా ఆదివాసులకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను సైతం గౌరవించడం లేదని ఆదివాసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతపైన జరిగిన దాడికి నిరసనగా మార్కెట్‌ బంద్‌ చేయాలని చెప్పినప్పటికీ పోలీసులు ఏకపక్షంగా పోలీసులు మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గూడెం గ్రామాలలో చర్చ జరుగుతోంది. పోలీసు వ్యవస్థకు 1/70, పెసా చట్టాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ, ఇలా కావాలని చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అనే సందేహం ఉందన్నారు. తమ హక్కులు, చట్టాలకు లోబడి చట్టాలను గౌరవిస్తూ ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ పనిచేయాలి కానీ, ఇలా జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులే చట్టాన్ని నిర్వీర్యం చేయడమేమిటని నిలదీస్తున్నారు.

ఆదివాసులు తీర్మానాలలోని పలు అంశాలు ఇవే

  1. ఏజెన్సీ మండలాలయిన సిర్పూర్‌, జ్కెనూర్‌, లింగపూర్‌ మండలాలలో 1/70 పెసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా అమలు చేయాలి.
  2. మర్సకోల లక్ష్మణ్‌పై దాడి చేసిన ముస్లిం, గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా అతని కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలి. నాణ్యమైన వైద్యం కూడా అందించాలి.
  3. మసీదుల పరిధిని తగ్గించాలి. బహిరం గంగా పెట్టవద్దు.
  4. అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి పంపాలి.
  5. మా గ్రామాలలో ఐస్‌క్రీం, ఇతర వ్యాపా రాల కోసం వచ్చే ముస్లింలను గ్రామాలకు రానివ్వొద్దు. వారు ఎలాంటి వ్యాపారం చేయ కూడదు.
  6. వలస వచ్చి అక్రమంగా భూములను ఆక్రమించిన వారి భూములను ఐటీడీఏ కోర్టు ద్వారా తిరిగి మాకు అప్పగించాలి.
  7. జైనూరులో వుండి ఆదివాసీలపై దాడి చేసి, భయంకరమైన వాతావరణం సృష్టించిన ముస్లింలకు ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేదు. మైదాన ప్రాంతానికి పంపాలి. ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *