అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్న ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజర్

ఇజ్రాయిల్ లోని భారత రాయబారి రూవెన్ అజర్ అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు. రాంలాలాను చూసేందుకు భార్యతో సహా వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ వుండే భక్తులతో మాట్లాడారు. అయోధ్య రామాలయాన్ని దర్శించుకోవడం తనకు చాలా గౌరవంగా వుందని, అద్భుతమైన ఆలయమని ప్రశంసించారు. అలాగే అయోధ్యను దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా భారీగా వుందని, వారి భక్తి అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అయోధ్యకు వచ్చి, రాముడ్ని చూసే అవకాశం లభించిందని, ఇది గౌరవంగా భావిస్తున్నానని ప్రకటించారు.
అలాగే ఇక్కడికి భక్తితో వస్తున్న భక్తులను చూసి, పొంగిపోతున్నానని అన్నారు. ఇజ్రాయిల్ ఎప్పుడూ భారత దేశ సంస్కృతిని గౌరవిస్తుందని, ఇరు దేశాల ప్రజలు పురాతన కాలం నుంచి కలిసే వున్నారన్నారు. భారత వారసత్వాన్ని చూసి తాము చాలా గర్వపడతామని పేర్కొన్నారు. అలాగే అయోధ్య, రాముడి విషయంలో ఇక్కడి వారికి చాలా భక్తిభావాలు వున్నాయని, అది ఇక్కడి వచ్చి, చూశానని పేర్కొన్నారు. మరోవైపు అయోధ్య రామ మందిరం గురించి, అయోధ్య ఉద్యమం గురించి కూడా రూవెన్ అడిగి తెలుసుకున్నారు.
చరిత్రలో ఈ స్థలంలో చాలా ఘటనలు జరిగాయని, వాటన్నింటినీ ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారని రాయబారి రూవెన్ పేర్కొన్నారు.  అయోధ్య విషయంలో స్థానికులు వల్లమాలిన అభిమానాన్ని చూపిస్తారని, అది ప్రస్ఫుటంగా తనకు కనిపించిందన్నారు. అయోధ్య కేంద్రంగా భారతీయ సంస్కృతిని లోతుగా తాను తెలుసుకోగలుగుతున్నానని రూవెన్ అజర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *