RSS స్మారక తపాలా స్టాంప్‌ను విడుదల చేసిన ”నెదర్లాండ్స్ హిందూ స్వయంసేవక్ సంఘ్”

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హిందూ స్వయంసేవక్ సంఘ్ నెదర్లాండ్స్ శాఖ వారు (HSS NL) స్మారక తపాలా స్టాంపును విడుదల చేశారు. మన ధర్మం పట్ల వంద సంవత్సరాల ఐక్యత, క్రమశిక్షణ, భక్తికి చిహ్నంగా అక్కడి స్వయంసేవకులు పేర్కొన్నారు. ఈ స్టాంపు కేవలం ఓ పోస్టల్ వస్తువు మాత్రమే కాదని, ఇదో నివాళి అని అన్నారు. అలాగే ఓ జ్ఞాపకం, ఓ ప్రేరణ అని అభివర్ణించారు.
ఈ స్టాంపుపై సంఘ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ బొమ్మతో పాటు ద్వితీయసరసంఘచాలక్ గురూజీ, మధ్యలో ఓం చిత్రం వుంది. అలాగే మధ్యలో పూర్ణగణవేష ధారి స్వయంసేవకులు ఘోష్ వాయిస్తూ కాషాయ ధ్వజాన్ని చేతపట్టుకొని వున్న చిత్రం వుంది.అలాగే 100YEARS PF SEFLESS SERVICE, NEDERLAND INTERNATIONAAL” అని కూడా స్టాంపుపై రాసి వుంది.ప్రతి స్వయంసేవక్‌కి కూడా ఈ స్టాంపును చూస్తే గర్వంగా వుండాలని, సంఘ కార్య శతాబ్దికి గుర్తింపుగా, స్వయంసేవకులు తమ జీవితాలను అంకితం చేసినందుకువారికి కృతజ్ఞతా పూర్వకంగా, ఓ అనుసంధాన చిహ్నంగా వుంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *