ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారంతో కూడిన కథనాలు.. ఇవీ అసలు వాస్తవాలు

ఒక దేశభక్తుడు లేదా మెరుగైన సమాజం, మెరుగైన దేశం కోసం అంకితమైపోయిన ఒక సామాజిక సేవా సంస్థ చేపట్టిన పవిత్రమైన కార్యంతో స్వార్థపూరితమైన, సంఘ వ్యతిరేక శక్తులు పోటీపడలేవు. అలాంటి వ్యక్తి లేదా సంస్థను అప్రతిష్ఠ పాల్జేయడమే వారి ముందున్న ఏకైక ఐచ్ఛికం. ఒక కల్పితమైన కథనంతో సోషల్‌ మీడియా వేదికలపై రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌)కు అపకీర్తి కలిగిస్తున్నారు.

దుష్ప్రచారం: ఆర్‌ఎస్‌ఎస్‌ త్రివర్ణ పతాకాన్ని గౌరవించదు

ఫైజాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశాల్లో పార్టీ అధ్యక్షులు పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ 80 అడుగుల ఎత్తైన స్తంభానికి త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. అయితే జాతీయ జెండా పూర్తిగా పైకి వెళ్లకుండా స్తంభం మధ్యలోనే చిక్కుకుపోయింది. అంత ఎత్తున్న స్తంభాన్ని పతాకాన్ని సరిచేసే సాహసానికి ఏ ఒక్కరూ పూనుకోలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో జన సమూహం మధ్యలో నుంచి ఒక యువకుడు ముందుకు దూసుకువచ్చారు. అందరూ చూస్తుండగానే స్తంభాన్ని అవలీలగా ఎక్కేసి జాతీయ పతాకాన్ని సరిచేయడంతో స్తంభం శిఖరాగ్రాన త్రివర్ణ పతాకం రెపరెపలాడిరది. స్తంభం నుంచి కిందకు దిగి వచ్చిన ఆ యువకుని అక్కడ ఉన్నవారంతా వారి భుజాలపైకి ఎత్తుకున్నారు. నెహ్రూ దగ్గరకు తీసుకురాగా ఆయన సదరు యువకుని అభినందనపూర్వకంగా భుజంపై తట్టారు. సాయంత్రం బహిరంగ సమావేశానికి వస్తే తగువిధంగా సత్కరించుకుంటామని ఆ యువకునితో నెహ్రూ అన్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు కాంగ్రెస్‌ నాయకులు నెహ్రూతో ‘‘అతడిని ఆహ్వానించకండి ఎందు కుంటే అతడు సంఫ్‌ు శాఖకు వెళుతుంటాడు’’ అని చెప్పారు. అత్యంత సాహసంతో స్తంభం పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని సరిచేసి, స్తంభం శిఖరాగ్రాన నిలిపిన ఆ యువకుడు ఫైజ్‌పూర్‌లో జల్‌గావ్‌కు చెందిన కిషన్‌ సింగ్‌ రాజ్‌పుత్‌. విషయం తెలుసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ హెడ్గేవార్‌ జీ ఆ స్వయంసేవకుని స్వయంగా కలిశారు. అభినందన పూర్వకంగా ఒక చిన్న వెండి పాత్రను డాక్టర్జీ అతడికి బహూకరించారు.

దురుద్దేశ్యంతో కూడుకున్న కథనాలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే దానర్థం అవాస్తవాలను వ్యాపింపజేయడం కాదు. స్వయంసేవకులు ఇలాంటి వాటి ప్రభావానికి లోనుకాకుండా స్థిరచిత్తంతో వారి కార్యాచరణను కొనసాగిస్తున్నారు.

  • పంకజ్‌ జగన్నాథ్‌ జేస్వాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *