సంఘ కార్యం వేగంగా విస్తరిస్తోంది

– కాచం రమేశ్‌, తెలంగాణ ప్రాంత కార్యవాహ, ఆర్‌ఎస్‌ఎస్‌

‘కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ దేశవ్యాప్తంగా, తెలంగాణా ప్రాంతంలో కూడా సంఘ కార్యం వేగంగా విస్తరిస్తున్నది. 2024 నాటికి లక్ష గ్రామాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని తప్పక పూర్తిచేయగలమనే విశ్వాసం కార్యకర్త లందరిలో కనిపిస్తున్నది. శాఖల విస్తరణతోపాటు సామాజిక కార్యక్రమాల సంఖ్య, విస్తరణ కూడా పెంచాలన్నది లక్ష్యం’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్‌ అన్నారు. హర్యానాలో మూడురోజులపాటు జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల విశేషాలను ఆయన పాత్రికేయులకు వివరించారు.

గత ఏడాది దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతో త్సవాలు జరిగాయని, ప్రస్తుతం తెలంగాణలో నైజాం విముక్త అమృతోత్సవాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మిగతా దేశాంకంటే తెలంగాణాకు ఒక సంవత్సరం ఆలస్యంగా స్వాతం త్య్రం వచ్చింది. నైజాం విముక్త అమృ తోత్సవ సమితి అధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరుగు తున్నాయి. 2022 సెప్టెంబర్‌ 17న 491మండల కేంద్రాల్లో త్రివర్ణపతాక ఆవిష్కరణ సమావేశాలు జరిగాయి. అందులో 31వేలకు పైగా ప్రజానీకం పాల్గొన్నారు. అలాగే 61జిల్లాల్లో యువసమ్మేళ నాలు జరిగాయి. ఇందులో లక్షన్నరకు పైగా విద్యార్ధులు పాల్గొన్నారు. వీరిలో 43వేల మంది విధ్యార్ధినులు ఉండడం విశేషం. జనవరి 1-15 వరకు జరిగిన ప్రచార కార్యక్రమంలో 7వేల గ్రామాలలో ఇంటింటికి వెళ్లి 15లక్షల కుటుంబా లకు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను వివరించే కరపత్రం, 16లక్షల స్టిక్కర్లు అందజేశా మని ఆయన తెలిపారు.

సమాజాభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు. ప్రతి గ్రామంలో సర్వే నిర్వహించి అక్కడి అవసరాలను గుర్తించి, అందుకు అనుగు ణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పాలిథిన్‌ రహిత జీవనాన్ని ప్రోత్సహించడం, జలవనరులను వృద్ధి చేయడం, వృక్షాల సంఖ్య పెంచడం వంటి కార్యక్ర మాలను ప్రజల సహాయ సహకారాలతో నిర్వహిస్తా మని అన్నారు. అలాగే క్షీణిస్తున్న కుటుంబ విలువలను పెంచడం కోసం, ప్రజలలో సమరసత, సద్భావన పెంపొందించడం కోసం కృషి చేస్తామని కూడా కాచం రమేశ్‌ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *