జబల్ పూర్ వేదికగా ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ లు ఈ సారి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్  వేదికగా జరగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ సమావేశాలు ఈ నెల 30 న ప్రారంభమై, నవంబర్ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం మూడు రోజుల పాటు జరుగుతాయని ఆయన తెలిపారు.
‘‘దీపావళి తర్వాత అక్టోబర్ 30,31, నవంబర్ 1 (కార్తిక శుక్ల అష్టమి, నవమి, దశమి) తేదీల్లో అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ లు జబల్ పూర్ వేదికగా జరుగుతాయి. ప్రస్తుతం సంఘ కార్య శతాబ్ది జరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు అత్యంత ప్రతిష్ఠాత్మకత సంతరించుకుంది.సంఘ విస్తరణ, లక్ష్యాల వైపు మరింత వేగంగా నడవడానికి, వీటిని సమీక్షించుకోవడానికి ఈ సమావేశాలు ఎంతో కీలకమైనవి’’ అని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.
ఈ సమావేశాలలో సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఆరుగురు సహ సర్ కార్యవాహ్ లు, అఖిల భారతీయ అధికారులతో పాటు వివిధ సంఘ ప్రేరేపిత సంస్థల అఖిల భారతీయ బాధ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *