నేపాల్ అల్లర్ల నేపథ్యంలో ‘‘హెల్ప్ లైన్’’ ప్రకటించిన ఆరెస్సెస్

నేపాల్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అవధ్ ప్రాంతానికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. బాధితులు, అవసరమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు సంబంధిత నెంబర్లను సంప్రదించవచ్చని ప్రకటించింది.

నరేష్ – విభాగ్ సంపర్క ప్రముఖ్ – 9453131365

అతుల్ – విభాగ్ ప్రచార ప్రముఖ్ – 9452536832, 8948519195

నరేంద్ర – జిల్లా వ్యవస్థా ప్రముఖ్ – 8009314250, 9369563504

రాం కృపాల్ – సీమా జాగరణ్ మంచ్ – 7054196767

నేపాల్‌లో చెలరేగుతున్న జన్‌-జడ్‌ నిరసనలను నిశితంగా పరిశీలిస్తున్న భారత్‌ అప్రమత్తమైంది.నేపాల్‌లోని అశాంతిని ఆసరాగా చేసుకుని సంఘ విద్రోహ శక్తులు భారత భూభాగంలోకి ప్రవేశించి, సరిహద్దు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. నేపాల్‌ సరిహద్దు (India-Nepal Border) రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోలీసులతో పాటు సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) బలగాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలోని గౌరిఫంటా సరిహద్దు వద్ద భద్రతా దళాలు పోలీసు పోర్టును ఏర్పాటు చేశారు. నేపాలీ పౌరులను భారత భూభాగంలోకి అనుమతించడం లేదు. అయితే, పొరుగు దేశంలోని భారతీయుల్ని మాత్రం స్వదేశంలోకి అనుమతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *