మార్పులు తీసుకురావడానికి క్రియాశీల సహకారులుగా వుండాలి : భయ్యాజీ జోషి

భారత దేశం శక్తిమంతం కావడమంటే ప్రపంచానికి రక్షకులుగా మారడమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు. రోజురోజుకీ పరిపుష్టం అవ్వడంలో విధ్వంసం లేదని, రక్షణ అన్న తత్వం ఇమిడి వుందన్నారు. అహ్మదాబాద్ లోని Hindu spiritual and service foundation ఆధ్వర్యంలో హిందూ ఆధ్యాత్మ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి భయ్యాజీ జోషితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భయ్యాజీ జోషి మాట్లాడుతూ  రోజు రోజుకీ శక్తిమంతం కావడం ద్వారా బలహీనులను, నిస్సహాయులకు సేవ చేయడం కోసమని అన్నారు. ప్రపంచాన్ని తమ వెంట కలిపి తీసుకెళ్లే గుణం ఒక్క భారత దేశానికి మాత్రమే వుందని, ఇతర దేశాలకు లేదన్నారు. ఆధ్యాత్మిక శక్తి, ఆలోచనలు, వసుధైక కుటుంబం అన్న తత్వం నుంచి భారత్ కి ఈ లక్షణం అలవడిందని వివరించారు. ప్రపంచం అంతా ఒకే కుటుంబం అన్న దానిని భారత్ ఉపాసిస్తోందన్నారు.
ప్రపంచంలో సమన్వయంతోనే శాంతి స్థాపన జరుగుతుందని భయ్యాజీ వివరించారు. అందర్నీ తమ వెంట నడిపించే సామర్థ్యం వున్న వారే శాంతిని స్థాపించగలుగుతారన్నారు. అన్ని వర్గాలు తమ తమ అభిప్రాయాల ప్రకారం నడుచుకునే అవకాశం వుందని, కానీ… ఇతరులను మాత్రం తమ అభిప్రాయాల మీద నడిచే వాతావరణం కలిపించని పక్షంలో శాంతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అందర్నీ కలుపుకెళ్లే వారు ప్రపంచంపై తమ ప్రభావాలను చూపించగలుగుతారని, ప్రపంచాన్ని కూడా నడపగలిగే సత్తా వుంటుందన్నారు.
భారత్ పుణ్యభూమి అని, దేవతల భూమి అని, సాధే సంతుల భూమి అని, అలాంటి దేశంలో మనం పుట్టామని అన్నారు. నిస్వార్థ భావన, అంకిత భావన నేర్పించే లక్షణం ఈ భూమికి వుందన్నారు. చాలా సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించిందని, కానీ… తర్వాత స్వేచ్ఛాయుత పౌరులుగా పిలిపించుకునే అదృష్టం స్వతంత్రం ద్వారా లభించిందని పేర్కొన్నారు. దేశంలో మార్పు పర్వం మొదలైందని తెలిపారు. ప్రస్తుతం మన దేశాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని, విదేశీ గడ్డలపై మన దేశాన్ని పొగడటం కూడా జరుగుతోందన్నారు. దీనిని చూసే అదృష్టం మనకు లభించిందన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికి క్రియాశీల సహకారులుగా వుండాలే కానీ… నిశ్శబ్ద సాక్షులు కాకూడదన్నదే సాధువులు, మహా పురుషుల ఆకాంక్ష అని తెలిపారు.
కొందరు మాత్రమే సేవ చేస్తారన్న అపోహ ప్రపంచంలో వుందని, కానీ… భారత్ లో అందరికీ సేవా గుణం వుందన్నారు. సుమారు కోటి మంది అన్నదానాలు చేస్తారని, ఇది మన సంప్రదాయమని తెలిపారు.గురుద్వారాలోని లంగర్‌కి వెళ్లినా, దుకాణాలకు వెళ్లినా, ప్రజలు అనేక రకాల ఏర్పాట్ల ద్వారా అన్న ప్రసాద వితరణలు జరుగుతున్నాయన్నారు. ఇదో పుణ్య కార్యంగా భావించే సంప్రదాయం మనకు వుందన్నారు. మన దేశంలో వున్న ఆధ్యాత్మిక సంస్థలు కేవలం పూజలు మాత్రమే చేయడం లేదని, అనేక రకాలుగా సేవలను కూడా చేస్తున్నాయన్నారు.
హిందూ అన్న దానిలో అనేక అంశాలు ఇమిడి వుంటాయని అన్నారు. హిందూ అంటే మతం, ఆధ్యాత్మికత, ఆలోచన, జీవన విశానం, జీవిత విలువ, సేవాగుణం తో పాటు అనేక అంశాలు వుంటాయన్నారు. హిందువు అంటే కేవలం దేవాలయాలకు వెళ్లే వ్యక్తి, కర్మలు చేసే వ్యక్తే కాదని వివరించారు. అనేక అంశాలతో హిందువుగా గుర్తింపును పొందుతారన్నారు. మతం అన్నప్పుడు దాని కేంద్ర బిందువు మానవత్వం అని, అది విధితో ముడిపడి వుంటుందన్నారు.
ధర్మాన్ని రక్షించడానికి హిందూ సమాజం ఎప్పుడు సిద్ధంగానే వుందన్నారు. ఏ పనినైతే అధర్మం అని అంటున్నారో… ధర్మం కోసం ఆ కార్యాన్ని కూడా చేయాల్సి వుంటుందన్నారు. దీనిని పుణ్య పురుషులు చేశారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ఉదాహరణ మహాభారతంలో కనిపిస్తుందని, కౌరవులు అధర్మం పక్షాన వుంటే.. పాండవులు ధర్మపక్షపాతులు అని అన్నారు. కౌరవులు యుద్ధ నియమాలను అనుసరించారు కానీ పాండవులు పాటిస్తూనే… అధర్మాన్ని జయించడానికి అన్నింటినీ త్యజించి, అధర్మాన్ని ఓడించడానికి పాండవులు కృషి చేశారని వివరించారు. ఏది ధర్మమో, ఏది అధర్మమో బోధించేది మతమని తెలిపారు. అహింస భావన రక్షణకు కొన్ని సందర్భాల్లో హింస తప్పనిసరి అని అన్నారు. లేదంటే అహింసావాదానికే ముప్పు కలుగుతుందని న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *