కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సరసంఘచాలక్ మోహన్ భాగవత్
రాష్ట్రంలో పర్యటిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ -ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు.ఆలయానికి చేరుకున్న మోహన్ భగవత్ కు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మోహన్ భగవత్ కు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు అమ్మవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి మాట్లాడుతూ గౌరవనీయులైన ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. వారికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితుల ఆశీర్వచనం కల్పించామన్నారు. వీటితో పాటు ప్రసాదాలు అందజేశామని తెలిపారు.