అందరూ ఓటెయ్యండి : భాగవత్ పిలుపు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగపూర్ లోని భౌజీ దఫ్తరీ ప్రాథమికోన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి హక్కని, అందరూ తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కుకి ఎంతో ప్రాధాన్యత వుందన్నారు. నిజానికి తాను ఉత్తరాఖండ్ పర్యటనలో వున్నానని, అయినా సరే… ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా నాగపూర్ కి వచ్చానని వెల్లడించారు. మహారాష్ట్రలో ఓటు హక్కును కలిగివున్న ప్రతి పౌరుడూ తమ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.