బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ ఆరెస్సెస్ ప్రకటన
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే నిలిపేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే డిమాండ్ చేశారు. అంతేకాకుండా అన్యాయంగా అరెస్టైన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ని కూడా విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనారిటీలపై దాడులు, హత్యలు, దోపిడీలు, దహనాలు జరుగుతున్నాయి. ఇవి అత్యంత అమానవీయం. ఈ దౌర్జన్యాలు అత్యంత ఆందోళనకరమైనవి. వీటిని ఆరెస్సెస్ తీవ్రంగా ఖండిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీటికి అడ్డుకట్ట వేయాల్సింది పోగా… కేవలం మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ అఘాయిత్యాలను ఆపడానికి వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రజాస్వామ్య మార్గంలో హిందువులు తమ స్వీయరక్షణ కోసం లేవనెత్తిన గొంతులను బలవంతంగా అణచివేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ ప్రపంచ దేశాలు, సంస్థలు బంగ్లాదేశ్ బాధితులకు మద్దతుగా నిలబడాలి. తమ మద్దతును ప్రకటించారు. ప్రపంచ శాంతి కోసం, సౌభ్రాతృత్వం కోసం ఈ ప్రయత్నం కొనసాగాలి’’ అని దత్తాత్రేయ హోసబళే పేర్కొన్నారు.