కామారెడ్డి అతలాకుతలం… సేవా కార్యక్రమాల్లో ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు

కామారెడ్డిలో కుంభవృష్టి కురిసింది. జన జీవనం అస్తవ్యస్తమైంది.జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో వర్షం పడింది. దాదాపు కామారెడ్డి పట్టణం మొత్తం నీటిలో మునిగిపోయింది. ఎటు చూసినా అస్తవ్యస్తమే. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు, సేవా భారతి కార్యకర్తలు అచంచల విశ్వాసం, మొక్కవోని ధైర్యం, సమాజం మనది అన్న విశాల దృక్పథంతో ప్రజలను కాపాడటానికి, వారికి కనీస అవసరాలను తీర్చడానికి రంగంలోకి దిగారు. సేవా కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పూర్తిగా సహకరిస్తూ వస్తున్నారు.

స్వయం సేవకులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా వరదల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినారు. మరియుఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలకు సహకరించి వరదల్లో చిక్కుకున్న 1071 మందిని కాపాడారు.

మొదటి రోజు కామారెడ్డి పట్టణ కేంద్రం నుంచి మొదలుకుని భిక్కనూరు వరకు 44వ జాతీయ రహదారిపై వరదలు ఉధృతంగా ప్రవహించడంతో బుధవారం రోజంతా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి, బస్వాపూర్‌ వద్ద జాతీయ రహదారిపై వరదలో చిక్కుకున్న పలువురు వాహనదారులకు మొదటి రోజు 700 మందికి పులిహోర, అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు సురక్షిత త్రాగు నీరు అందించినారు.

మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామంలో ముంపుకు గురై, పాఠశాలలో ఉంటున్న వారికి సేవ భారతి ఆధ్వర్యంలో అత్యవసర మందులు మరియు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు.

రాజంపేట మండలం నడిమి తండా లేత మామిడి తండా వాసులు అత్యధిక వర్షపాతం నమోదు కారణంగా ఆ పక్క నుంచి ప్రవహిస్తున్న వరద పూర్తిగా తండా వాసుల గృహాలు ధ్వంసంమై నిరాశ్రయులు అయ్యారు.సుమారు 5 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. సుమారు 35 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. చిన్నారులు, పెద్దలు సుమారు 250 మంది నిరాశ్రయులయ్యారు. అక్కడికి మన కార్యకర్తలు ఆహారపు ప్యాకెట్లు తయారు చేసి, పంపిణీ చేశారు. ఇలా రెండు రోజుల పాటు పూర్తిగా ఆహారం అందిస్తూ, సేవలో నిమగ్నమయ్యారు. అలాగే నిత్యావసర వస్తువులైన బియ్యం, మక్కపిండి, పప్పులు, ఉప్పు కారం, నూనె, ప్లేట్లు, బగోన్లు, బకిట్లు గ్లాసులు బట్టలు, రగ్గులు కూడా అందజేశారు.


తండవాసులు రాత్రి కూడా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశం తో దోమకొండ ఖండ కేంద్రంలో సుమారు 30 ఇళ్లలో నుంచి 500 చపాతీలను సేకరించి అందజేశారు.కామారెడ్డి నగరంలో బతుకమ్మ కుంటలో 170 మందికి, అంబేద్కర్ నగర్ లో 70 మందికి, అయ్యప్ప కాలనిలో 100 మందికి,జీ ఆర్ కాలనీలో 150 మందికి జాతీయ రహదారుల వెంట 700 మందికి బస్టాండులో 160 మందికి మొత్తం 1350 మందికి సమాజ సహకారం తో స్వయం సేవకులు ఆహారం, నీరు అందించి, వారి ఆకలిని తీర్చారు.


మూడవ రోజు బతుకమ్మ కుంట, డ్రైవర్స్ కాలనీ లలో 40 మందికి ఆహారం అందజేశారు. అలాగే లింగంపేట్ మండలం లోని కోమట్ పల్లిలో 200 మందికి ఆహారం అందించారు. ఇప్పటికీ తాము సేవా కార్యక్రమాల్లోనే నిమగ్నమై వున్నామని, సమాజ సహకారంతో ఇబ్బందిపడుతున్న నిరాశ్రయులను సహాయ సహకారాలు అందిస్తామని ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *